Hadith for the World
పేర్లు మరియు ఆదేశాలు.

విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల

5 hadiths

5 hadiths

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.ముస్లిం నమోదు చేసినారు:
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: "ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ: أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إِلَّا لِلَّهِ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ".متفق عليه
అల్ అబ్బాస్ ఇబ్న్ అల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) తాను రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నాను అని ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసినాడు.”ముస్లిం నమోదు చేసినారు: