Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను:

Available in 70 languages
«అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నిషేధించిన ప్రతి చెడును, ప్రతి ఒక్కరూ తన సమర్థతను బట్టి ఆపాలి అని ఆదేశిస్తున్నారు. ఒకవేళ అతడు ఏదైనా చెడును చూసినట్లయితే, అతడు దానిని చేతితో ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉంటే (అంటే దానిని చేతితో అడ్డుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటే) అతడు తప్పనిసరిగా అలా చేయాలి. ఒకవేళ అతడు చేతితో ఆ చెడును ఆపలేకపోతే, అతడు ఆ పనిని తన నాలుకతో ఆపాలి. (నాలుకతో ఆపడం అంటే) ఆ చెడును చేస్తున్న వానికి అతడు చేస్తున్నది చెడు అని, తద్వారా అతడు కలుగజేస్తున్న కీడును గురించి అతడికి వివరించాలి, అతడికి మంచి వైపునకు మార్గ దర్శనం చేయాలి. ఒకవేళ అతనిలో అంత సమర్థత కూడా లేనట్లయితే, అపుడు కనీసం అతడు తన మనసులోనైనా ఆ జరుగుతున్న చెడును అసహ్యించుకుని, దానిని అడ్డుకోగలిగే సమర్థత గనక తనకు ఉండి ఉంటే దానిని తప్పనిసరిగా అడ్డుకుంటాను అని సంకల్పం చేసుకోవాలి. చెడును అడ్డుకుని, దానిని మార్చగలిగే సామర్థ్యపు స్థాయిలలో, మనసు యొక్క స్థాయి అత్యంత బలహీనమైన స్థాయి.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality