Hadith for the World
పేర్లు మరియు ఆదేశాలు.

విశ్వాసము యొక్క భాగాలు

3 hadiths

3 hadiths

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి. ఒక మనిషి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రానికి అవిశాసిగా మారిపోతాడు; లేక అతడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక లాభం కోసం అతడు తన ధర్మాన్ని అమ్మేస్తాడు”ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «الإيمانُ بِضْعٌ وَسَبْعُونَ أو بِضْعٌ وسِتُّونَ شُعْبَةً: فَأَفْضَلُهَا قَوْلُ: لا إله إلا الله، وَأَدْنَاهَا إِمَاطَةُ الأَذَى عَنِ الطَّرِيقِ، وَالحَيَاءُ شُعْبَةٌ مِنَ الإِيمَانِ».متفق عليه
అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.ముస్లిం నమోదు చేసినారు: