Hadith for the World
పేర్లు మరియు ఆదేశాలు.

కపటము

1 hadiths

1 hadiths

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు. నిశ్చయంగా కొన్నిసార్లు నేనిలా అనుకున్నాను – సలాహ్ కొరకు ఆదేశించి (అదాన్ ఇవ్వమని ఆదేశించి), సలాహ్ ప్రారంభించమని చెప్పి (ఇఖామత్ పలుకమని ఆదేశించి), ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత ఒక వ్యక్తిని కట్టెల మోపుతో నావెంట తీసుకుని బయలుదేరి, నమాజు కొరకు రాని వారి వైపునకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు