Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:

Available in 64 languages
«ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

భోజనము వడ్డించి ఉన్నపుడు సలాహ్ ఆచరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, ఎందుకంటే సలాహ్ ఆచరిస్తున్న వానిలో ఆ ఆహారాన్ని భుజించాలనే అపేక్ష ఉంటుంది, అతని మనసు ఆ వడ్డించబడి ఉన్న ఆహారానికే అంటుకుని ఉంటుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు అశుద్ధ విషయాలను, విడుదల చేయవలసిన తీవ్ర అవసరం ఉన్నప్పటికీ, వాటిని ఆపి ఉంచుకుని సలాహ్ ఆచరించుటను నిషేధించినారు. అవి ఒకటి మూత్ర విసర్జన, రెండు మలవిసర్జన. ఎందుకంటే అతడి ధ్యానము వాటిని ఆపి ఉంచుకొనుటకు చేసే ప్రయత్నం పైనే ఉంటుంది.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality