Hadith for the World
నమాజు

నమాజ్ చదివే వారి తప్పిదాలు

5 hadiths

5 hadiths

ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”ముస్లిం నమోదు చేసినారు:
عن أنس بن مالك رضي الله عنه أن النبي صلى الله عليه وسلم رأى نُخْامَة في القِبْلَة، فَشَقَّ ذلك عليه حتى رُئِي في وجْهِه، فقام فَحَكَّه بِيَده، فقال: «إن أحدكم إذا قام في صلاته فإنه يُنَاجِي رَبَّه، أو إن رَبَّه بينه وبين القِبْلَة، فلا يَبْزُقَنَّ أحدُكم قِبَل قِبْلتِه، ولكن عن يَسَاره أو تحت قَدَمَيه» ثم أخذ طَرف رِدَائِه، فَبَصَقَ فيه ثم ردَّ بَعْضَهُ على بعض، فقال: «أو يفعل هكذا».متفق عليه
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది"అల్ బుఖారీ నమోదు చేసినారు:
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”.ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు: