Hadith for the World
నమాజు

అజాన్ మరియు ఇఖామత్

6 hadiths

6 hadiths

అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నమాజు కొరకు (ముఅజ్జిన్ యొక్క) అజాన్ పిలుపు విన్నపుడు, మీరు కూడా ముఅజ్జిన్ మాదిరిగానే పలకండి”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إِذَا نُودِيَ بالصَّلاَةِ، أدْبَرَ الشَّيْطَانُ، وَلَهُ ضُرَاطٌ حَتَّى لاَ يَسْمَعَ التَّأذِينَ، فَإذَا قُضِيَ النِّدَاءُ أقْبَلَ، حَتَّى إِذَا ثُوِّبَ للصَّلاةِ أدْبَرَ، حَتَّى إِذَا قُضِيَ التَّثْوِيبُ أقْبَلَ، حَتَّى يَخْطِرَ بَيْنَ المَرْءِ وَنَفْسِهِ، يَقُولُ: اذْكُرْ كَذَا واذكر كَذَا - لِمَا لَمْ يَذْكُر مِنْ قَبْلُ - حَتَّى يَظَلَّ الرَّجُلُ مَا يَدْرِي كَمْ صَلَّى».متفق عليه
ముఆవియహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “తీర్పు దినము నాడు ప్రజల మధ్య ‘ముఅజ్జిన్’లు (మస్జిదులలో అజాన్ పలికేవారు) పొడవైన మెడలు కలిగి ఉంటారు.”ముస్లిం నమోదు చేసినారు:
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి) ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”ముస్లిం నమోదు చేసినారు: