Hadith for the World
నమాజు

నమాజ్ దఆలు

15 hadiths

15 hadiths

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో ప్రారంభములో “అల్లాహు అక్బర్” అని పలికినపుడు ఖుర్’ఆన్ పఠనం ప్రారంభించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉంటారు. నేను వారితో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం అగుగాక, ‘తక్బీర్’కు మరియు ‘ఖుర్ఆన్ పఠనానికి’ మధ్య మీరు ఏమి పలుకుతున్నారు?” దానికి వారు “నేను ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జీ వల్ మాఇ వల్ బరది’ అని పలుకుతాను” అన్నారు (ఓ అల్లాహ్! నన్ను నా పాపాల నుండి దూరంగా ఉంచు, ఏవిధంగానైతే నీవు తూర్పును పడమర నుండి దూరంగా ఉంచినావో; ఓ అల్లాహ్! ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా నన్ను నా పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయి; ఓ అల్లాహ్! నా పాపాలను నానుంచి నీళ్ళు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయి).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)అబూ దావూద్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబూ లైలా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను క’అబ్ ఇబ్న్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ను కలవడం జరిగింది. ఆయన “నేను నీకు ఒక బహుమతి ఇవ్వనా?” అన్నాడు. “ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?” అని అన్నాము. దానికి ఆయన “మీరు ఇలా పలకండి – ‘అల్లాహుమ్మ, సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లయిత అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్; అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్, వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్’ (ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శాంతిని కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శాంతిని కురిపించినావో, నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు; ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عائشة رضي الله عنها أنّ رسولَ اللهِ صلى الله عليه وسلم كانَ يقول في ركوعه وسجودِه: «سبُّوحٌ قُدُّوسٌ رَبُّ المَلاَئِكَةِ وَالرُّوحِ».رواه مسلم
కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”ముస్లిం నమోదు చేసినారు:
عن علي بن أبي طالب رضي الله عنه أنَّ رسولَ الله صلى الله عليه وسلم كان إذا قامَ إلى الصلاة، قال: «وَجَّهتُ وجهي للذي فطر السماوات والأرض حنيفًا، وما أنا من المشركين، إنَّ صلاتي، ونُسُكي، ومَحياي، ومماتي لله رب العالمين، لا شريك له، وبذلك أُمِرتُ وأنا من المسلمين، اللهمَّ أنت المَلِك لا إله إلَّا أنت، أنت ربي، وأنا عبدك، ظلمتُ نفسي، واعترفتُ بذنبي، فاغفر لي ذنوبي جميعًا، إنه لا يغفر الذنوب إلا أنت، واهدني لأحسن الأخلاق لا يهدي لأحسنها إلا أنت، واصرف عني سيئَها لا يصرف عني سيئها إلا أنت، لبَّيْك وسَعْدَيْك، والخيرُ كله في يديك، والشر ليس إليك، أنا بك وإليك، تباركتَ وتعاليتَ، أستغفرك وأتوب إليك»، وإذا ركع، قال: «اللهمَّ لك ركعتُ، وبك آمنتُ، ولك أسلمتُ، خشع لك سمعي، وبصري، ومُخِّي، وعظمي، وعَصَبي»، وإذا رفع، قال: «اللهم ربنا لك الحمد مِلءَ السماوات، ومِلءَ الأرض، ومِلءَ ما بينهما، ومِلءَ ما شئتَ من شيء بعد»، وإذا سجد، قال: «اللهم لك سجدتُ، وبك آمنتُ، ولك أسلمتُ، سجد وجهي للذي خلقه، وصوَّره، وشقَّ سمعَه وبصرَه، تبارك الله أحسنُ الخالقين»، ثم يكون من آخر ما يقول بين التشهُّد والتسليم: «اللهم اغفر لي ما قدَّمتُ وما أخَّرتُ، وما أسررتُ وما أعلنتُ، وما أسرفتُ، وما أنت أعلم به مني، أنت المُقَدِّم وأنت المؤَخِّر، لا إله إلا أنت».رواه مسلم
عن الحكم قال: غَلَب على الكُوفة رجُل -قد سَمَّاه- زَمَنَ ابن الأشْعَث، فأمر أبَا عُبيدة بن عبد الله أن يصلِّي بالناس، فكان يصلِّي، فإذا رَفع رأسه من الرُّكوع قام قَدْر ما أقُول: اللَّهُم ربَّنا لك الحَمد، مِلْءَ السَّماوات ومِلْءَ الأرض، ومِلْءَ ما شِئت من شَيء بعد، أهْل الثَّناء والمَجد، لا مانع لما أعْطَيت، ولا مُعْطِي لما مَنعت، ولا يَنفع ذَا الجَدِّ مِنْك الجَدِّ. قال الحَكم: فَذَكَرت ذلك لعَبد الرَّحمن بن أبي ليلى فقال: سمعت البَرَاء بن عَازب يقول: «كانت صلاة رسول الله صلى الله عليه وسلم وركُوعه، وإذا رفع رأسه من الرُّكوع، وسُجوده، وما بَيْن السَّجدتين، قريبًا من السَّوَاء» قال شُعبة: فذَكَرْتُه لِعَمرو بن مُرَّة فقال: قد رأيت ابن أبي ليلى، فلم تَكن صلاته هكذا.رواه مسلم
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మార్గదర్శకాన్ని ప్రసాదించు మరియు నాకు ఉపాధిని ప్రసాదించు) అని పలికేవారు.”అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, ఆయన ఇలా పలికినారు: “ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”అన్నసాయీ అల్ కుబ్రాలో నమోదు చేసినారు:
ఇబ్న్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు ఇలా పలికినారు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్, అల్లాహుమ్మ, రబ్బనా లకల్ హందు, మిల్’అస్సమావాతి, వ మిల్ అల్ అర్ధి, వ మిల్ అమా షి’త మిన్ షైఇన్ బ’ద్” (తనను స్తుతించిన వారి స్తోత్రములను అల్లాహ్ విన్నాడు. ఓ అల్లాహ్! మా ప్రభువా! సకల స్తోత్రములూ నీ కొరకే, ఆకాశాన్ని నింపినంత, భూమిని నింపినంత మరియు ఆ తర్వాత నీవు కోరుకున్నంత స్తోత్రం నీకొరకే).”ముస్లిం నమోదు చేసినారు:
عن ابن عمر قال: بينما نحن نصلي مع رسول الله صلى الله عليه وسلم إذ قال رجل من القوم: الله أكبر كبيرًا، والحمد لله كثيرًا، وسبحان الله بكرةً وأصيلًا، فقال رسول الله صلى الله عليه وسلم: «من القائلُ كلمة كذا وكذا؟» قال رجل من القوم: أنا، يا رسول الله. قال: «عجبتُ لها، فتحت لها أبواب السماء» قال ابن عمر: «فما تركتهن منذ سمعتُ رسول الله صلى الله عليه وسلم يقول ذلك».رواه مسلم
عن أبي بكر الصديق رضي الله عنه: أنه قال لرسول الله صلى الله عليه وسلم: علمني دعاء أدعو به في صلاتي، قال: "قل: اللهم إني ظلمت نفسي ظلما كثيرا، ولا يغفر الذنوب إلا أنت، فاغفر لي مغفرة من عندك، وارحمني إنك أنت الغفور الرحيم".متفق عليه