Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ ఉమామహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు ఈ విషయాన్ని అమ్ర్ ఇబ్న్ అబసహ్ రదియల్లాహు అన్హు తెలియజేసారు; ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నారు:

Available in 55 languages
«అబూ ఉమామహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు ఈ విషయాన్ని అమ్ర్ ఇబ్న్ అబసహ్ రదియల్లాహు అన్హు తెలియజేసారు; ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నారు: “ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము. ఆ ఘడియలో (రాత్రి చివరి భాగములో) అల్లాహ్ ను స్మరించే వారిలో ఒకరు కాగలిగే సామర్థ్యము మీలో ఉంటే అలా చేయండి.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: " సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ రాత్రి చివరి మూడవ భాగంలో, తన దాసునికి అత్యంత చేరువగా ఉంటాడు; కనుక ఓ విశ్వాసి! మీరు నిద్ర నుండి లేవడంలో విజయం సాధిస్తే, ఈ సమయంలో అల్లాహ్‌ను ఆరాధించే, ప్రార్థించే, ధ్యానించే మరియు అల్లాహ్ ఎదుట పశ్చాత్తాపపడే వారిలో మీరు కూడా చేరగలిగితే, అలా తప్పక చేయండి, ఎందుకంటే ఇది శ్రద్ధతో ఒడిసి పట్టుకోవలసిన అద్భుత అవకాశం.

Source
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
Download image

Saved at original quality