సద్గుణాలు మరియు పద్దతులు
సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
Available in 59 languages
«సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్. అబూ ఖిలాబహ్ (హదీసు ఉల్లేఖకులలో ఒకరు) ఇలా అన్నారు: “ఆయన కుటుంబము (పై ఖర్చు చేయుట) తో మొదలు పెట్టినారు”, తరువాత అబూ ఖిలాబహ్ ఇంకా ఇలా అన్నారు: “తన కుటుంబములోని చిన్న పిల్లల కోసం ఖర్చు చేసే వ్యక్తి కంటే గొప్ప ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? తద్వారా అతడు వారిని కాపాడుతాడు (కోరికల నుండి కాపాడతాడు) మరియు దాని వల్ల అల్లాహ్ వారికి లాభం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.”»Meaning translation ·
Saved at original quality








