Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:

Available in 54 languages
«అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమదాన్ నెల ఆరంభాన్ని గురించి మరియు దాని ముగింపు గురించిన చిహ్నాలను ఈ విధంగా వివరిస్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “రమదాన్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసాలు ప్రారంభించండి, ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, షఅబాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి; మరియు షవ్వాల్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసములు విరమించండి; ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, రమదాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి.”

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality