ఫిఖ్ మరియు దాని నియమాలు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
Available in 60 languages
«అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది ఎందుకంటే అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా ఉదూ చేస్తాడు, తరువాత అతడు మస్జిద్ కు బయలుదేరుతాడు; అతడిని సలాహ్ తప్ప మరింకే విషయమూ అలా చేయడానికి ప్రోత్సహించదు; సలాహ్ ఆచరించడం తప్ప అతడు మరింకేదీ కోరుకోడు; (అటువంటి స్థితిలో) అతడు మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; అతడి నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది; మరి మస్జిదులోనికి ప్రవేశించిన తరువాత కేవలం సలాహ్ మాత్రమే అతడు మస్జిదులో వేచి ఉండేలా చేసినట్లయితే, అతడు వేచి ఉన్న సమయమంతా అతడు సలాహ్ లోనే ఉన్నట్లుగా భావించబడుతుంది; అటువంటి వాని కొరకు, అతడు సలాహ్ ఆచరించిన స్థానములోనే కూర్చుని ఉన్నంత వరకు, దైవదూతలు అల్లాహ్’ను ప్రార్థిస్తూ ఉంటారు – నీవు అక్కడ ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంత వరకు, లేదా నీ ఉదూ భంగం కానంత వరకు దైవదూతలు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు “ఓ అల్లాహ్ అతడిని కరుణించు, ఓ అల్లాహ్ అతడిని క్షమించు, ఓ అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”.»Meaning translation ·
Saved at original quality








