Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 70 languages
«ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రజలలో ఎవరైతే ఏదైనా విషయంపై విపరీత స్థాయిలో జగడానికి దిగుతాడో లేక ఎక్కువగా అలాంటి జగడాలు పెట్టుకుంటాడో అటువంటి వానిని పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు, స్వయం సమృధ్ధుడూ అయిన అల్లాహ్ అసహ్యించుకుంటాడు. అటువంటి వాడు సత్యానికి విధేయత చూపడు. తన వాదనలతో సత్యాన్ని త్రోసి పుచ్చడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఒకవేళ అతడు సత్యము పైనే ఉన్నా, జగడంలో ఎంత విపరీత స్థాయికి వెళతాడూ అంటే సహనము, సభ్యతల హద్దు దాటి ప్రవర్తిస్తాడు, మూర్ఖత్వంతో వాదిస్తాడు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality