అల్ అఖీద
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
Available in 65 languages
«అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలికినాడు: ‘ఎవరైతే నా వలీ పట్ల (వలీ – ధర్మనిష్టాపరుడైన అల్లాహ్ యొక్క దాసుడు) శతృత్వం వహిస్తాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే అతనిపై ‘ఫర్జ్’ చేసినానో అది నాకు అత్యంత ఇష్టమైనది; నా దాసుడు దాని ద్వారా తప్ప నాకు చేరువ కాలేడు. ఇంకా అతడు ‘నఫీల్’ ఆచరణలు ఆచరిస్తూ నాకు ఇంకా చేరువ అవుతూనే ఉంటాడు, ఎంతగా అంటే, నేను అతడిని ప్రేమించేంత వరకు. నేను అతడిని ప్రేమించినట్లయితే నేను అతడి వినికిడి శక్తినవుతాను, దేని ద్వారానైతే అతడు వింటాడో, నేను అతడి దృష్టినవుతాను, దేనిద్వారానైతే అతడు చూడగలుగుతాడో, నేను అతడి చేతినవుతాను, దేని ద్వారానైతే అతడు (శత్రువులను) ప్రతాడించుతాడో, నేను అతడి కాలునవుతాను, దేని ద్వారానైతే అతడు నడుస్తాడో. అతడు దేని కొరకైనా అర్థించినట్లయితే, నేను అతనికి తప్పనిసరిగా ప్రసాదిస్తాను; అతడు నా నుండి రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ ప్రసాదిస్తాను. ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు అతనికి కష్టం కలిగించడాన్ని నేను ఇష్టపడను.”»Meaning translation ·
Saved at original quality








