Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకగా తాను విన్నానని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:

Available in 48 languages
«రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకగా తాను విన్నానని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేశారు: 'ఎవరైతే నా మాటలు విని, వాటిని గట్టిగా గుర్తుంచుకుని ఇతరులకు చేరవేస్తాడో, అల్లాహ్ అతనికి ఇహలోకంలో తేజస్సు, ఆనందం మరియు అందాన్ని ప్రసాదించుగాక! మరియు పరలోకంలో స్వర్గం యొక్క తేజస్సు, సుఖాలు మరియు ప్రకాశాన్ని అనుగ్రహించుగాక!' ఎందుకంటే, సందేశాన్ని అందుకున్న వ్యక్తి (శిష్యుడు), దాన్ని తెలియజేసిన వ్యక్తి (గురువు) కంటే ఎక్కువ గ్రహించే శక్తి, వివేకం మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. ఇదే విధంగా, మొదటి వ్యక్తి (గురువు) సరిగ్గా గుర్తుంచుకుని అందించడంలో నిష్ణాతుడైతే, రెండవ వ్యక్తి (శిష్యుడు) ఆలోచించి తార్కికంగా అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు కావచ్చు."

Source
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality