అల్ అఖీద
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
Available in 55 languages
«అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు ఆయన “నేను మీకు దానికంటే కూడా ఉత్తమమైన దానిని ప్రసాదిస్తాను” అంటాడు. వారు “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది?” అంటారు. అప్పుడు ఆయన ఇలా అంటాడు: “నేను మీకు నా ప్రమోదాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాను మరియు ఆ తర్వాత నేను మీ పట్ల ఎన్నటికీ అసంతృప్తి చెందను.”»Meaning translation ·
Saved at original quality








