Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

హిషామ్ ఇబ్న్ హకీమ్ ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన సిరియాలో ఉన్నపుడు, ఒకసారి ఎండలో నిలబెట్టబడిన కొంతమంది నబాటేనియన్లను దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడ ఉన్న వారిని “వారి విషయం ఏమిటి?” అని ప్రశ్నించారు. దానికి వారు: “జిజియా చెల్లించనందుకు వారు నిర్బంధించబడినారు” అని బదులిచ్చినారు. అప్పుడు హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నిశ్చయంగా నేను విన్నాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

Available in 40 languages
«హిషామ్ ఇబ్న్ హకీమ్ ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన సిరియాలో ఉన్నపుడు, ఒకసారి ఎండలో నిలబెట్టబడిన కొంతమంది నబాటేనియన్లను దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడ ఉన్న వారిని “వారి విషయం ఏమిటి?” అని ప్రశ్నించారు. దానికి వారు: “జిజియా చెల్లించనందుకు వారు నిర్బంధించబడినారు” అని బదులిచ్చినారు. అప్పుడు హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నిశ్చయంగా నేను విన్నాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

హిషాం బిన్ హాకిం బిన్ హిజాం రదియల్లాహు అన్హుమా సిరియాలో ఉండగా, ఒకసారి మండుతున్న ఎండలో నిలబడి ఉన్న కొంతమందిని దాటుకుంటూ వెళ్ళినారు. వారిని గురించి ఆయన వాకబు చేసినారు. వారు చెల్లించగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, జిజియా పన్ను చెల్లించనందుకు వారు ఆ మండుతున్న ఎండలో నిలబెట్టబడినారు అని ఆయనకు తెలియజేయడం జరిగింది. అది విని హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “”నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను అన్యాయంగా, ఎటువంటి హక్కు లేకుండా హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality