Hadith for the World
ఫజాయిల్

దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు

5 hadiths

5 hadiths

عن أبي أمامة رضي الله عنه قال: سمعتُ رسولَ اللهِ صلى الله عليه وسلم يقولُ: «اقْرَؤُوا القرْآنَ؛ فَإنَّهُ يَأتِي يَوْمَ القِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ».رواه مسلم
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది. (కనుక) “అలిఫ్, లామ్, మీమ్” ను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.” (అంటే దివ్య ఖుర్’ఆన్ గ్రంథము నుండి ఎవరైనా “అలిఫ్, లామ్, మీమ్” అని పఠిస్తే వారికి ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయిఅని అర్థము).అత్తిర్మిదీ నమోదు చేసినారు:
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ ఉమామహ్ అల్ బాహిలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఖుర్ఆన్ పఠించండి, ఎందుకంటే పునరుత్థాన దినాన అది దానిని పఠించేవారికి మధ్యవర్తిగా వస్తుంది. “జహ్’రావైన్”లను (రెండు ప్రకాశవంతమైన వాటిని), అంటే “సూరతుల్-బఖరహ్ మరియు సూరతుల్-ఆలి ఇమ్రాన్” లను పఠించండి. ఎందుకంటే తీర్పు దినమున అవి రెండు మేఘాలుగా లేదా రెండు ఘనమైన ఛాయలుగా లేదా రెండు పక్షుల గుపులుగా వచ్చి వాటిని పఠించే వారి కోసం వేడుకుంటాయి. సూరతుల్-బఖరహ్ పఠించండి, ఎందుకంటే దానిని ఆశ్రయించడం ఒక వరం మరియు దానిని వదులుకోవడం దుఃఖానికి కారణం; మరియు మాంత్రికులు, జాదూ చేసేవారు దానిని ఎదుర్కోలేరు.”ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : “(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది.అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు: