Hadith for the World
ఉపవాసములు

రమదాన్ మాసపు చివరి పది రోజులు

4 hadiths

4 hadiths

ఉమ్ముల్ ము'మినీన్, విశ్వాసుల మాత అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు