Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :

Available in 61 languages
«అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ఎడారి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఒక మంచి ఆచరణను నాకు సూచించండి”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ ను ఆరాధించు; (అందులో) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకు; నిర్దేశించబడిన ఐదు నమాజులను ఆచరించు; విధి చేయబడిన జకాతును చెల్లించు; మరియు రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు”. అది విని ఆ ఎడారి వాసి ఇలా అన్నాడు: “నా ప్రాణాలు ఎవరి చేతిలోనైతే ఉన్నాయో, ఆయన సాక్షిగా; మీరు చెప్పిన విషయాలకు ఒక్కటి కూడా అధికం చేయను (కలుపను)”. అలా అని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు అతడి వైపు చూడండి.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఎడారి వాసులలో నుండి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తనను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఆచరణను సూచించమని అడగడానికి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి – స్వర్గములోనికి ప్రవేశించుట మరియు నరకాగ్ని నుండి విముక్తి పొందుట అనేది ఇస్లాం యొక్క మూలస్థంభములను ఆచరించుటపై ఆధారపడి ఉంటుంది; వాటిలో ఒకటి అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట, మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించకుండా ఉండుట; రాత్రీ మరియు పగటి పూటలలో అల్లాహ్ తన దాసులపై విధిగావించిన ఐదు నమాజులను నెలకోల్పటం; అల్లాహ్ నీపై విధిగావించిన జకాతును అర్హులైన వారికి తప్పనిసరిగా చెల్లించుట; రమజాన్ మాసపు ఉపవాసాల ఆచరణను వాటి కొరకు విధిగావించబడిన సమయములోనే ఆచరించుట. అది విని ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉన్నదో ఆయన సాక్షిగా, మీ నుంచి నేను విన్నటువంటి విధిగావించబడిన ఆరాధనలకు ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, అలాగే వాటి నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను.” అతడు అక్కడి నుండి బయలుదేరిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు ఈ ఎడారి నివాసిని చూడండి.”

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality