Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 49 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్‌ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించడాన్ని నిషేధించారు (రమదాన్ మొదటి రోజు ఉపవాసం తప్పి పోకుండా ముందు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో). ఎందుకంటే రమదాన్ నెల ఉపవాసాల ఆరంభం ఖుర్ఆన్ ఆజ్ఞ ప్రకారం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంది, కాబట్టి అనవసరంగా ముందస్తు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality