అల్ అఖీద
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
Available in 62 languages
«జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. రాత్రి ఆయన చంద్రుని వైపు చూసినారు – అంటే పూర్ణ చంద్రుడిని – చూసి ఇలా అన్నారు: “నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు. కనుక సూర్యుడు ఉదయించడానికి ముందు నమాజును (ఫజ్ర్ నమాజును) మరియు అతడు అస్తమించడానికి ముందు నమాజును (అస్ర్ నమాజును) ఆచరించకుండా ఉండేలా చేసే దేనినైనా, మిమ్మల్ని లొంగదీసుకోకుండా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటే అలా చేయండి (అంటే ఆ నమాజులను వదలకుండా ఆచరించండి)”. తరువాత వారు ఈ ఆయతును పఠించినారు “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)»Meaning translation ·
Saved at original quality








