«అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే “అల్’లాత్” మరియు “అల్’ఉజ్జా” ల సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తాడో, అతడు మరలా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. ఎవరైతే తన సహచరునితో “రా, నీతో జూదమాడనివ్వు” అని ఆహ్వానిస్తాడో, అతడు దానధర్మాలు చేయాలి.”»
Meaning translation ·
Explanation
The meaning in a few plain lines
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరునగాక వేరొకరి పేరుతో ప్రమాణం చేయరాదని హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే ఒక విశ్వాసి కేవలం అల్లాహ్ పేరుతో మాత్రమే ప్రమాణం చేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేస్తున్నారు: అల్’లాత్ మరియు అల్ ఉజ్జా అనేవి రెండు విగ్రహాలు, ఇస్లాంకు పూర్వం ప్రజలు వీటికి పూజలు చేసేవారు, వీటిని ఆరాధించేవారు. ఎవరైతే ఈ రెండు విగ్రహాల పేరున ప్రమాణం చేస్తాడో, అతడు – బహుదైవారాధనలో పడిపోకుండా, దాని నుండి దూరంగా ఉండేందుకు గానూ మరియు అల్’లాత్, అల్ ఉజ్జాల పేరిట తాను చేసిన ప్రమాణానికి పరిహారంగానూ, తనను తాను సరిదిద్దుకుంటూ – అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: జూదము అంటే అందులో ఇద్దరు వ్యక్తులు పోటీ పడతారు. వారి మధ్య ధారాళంగా డబ్బు మార్పిడి ఉంటుంది. గెలిచిన వాడు మొత్తం డబ్బును తీసుకు వెళతాడు. ఇందులో ఉన్న ఇద్దరూ లాభనష్టాల ఊబి నుండి విముక్తులై లేరు. ఒకరి లాభము మరొకరి నష్టమవుతుంది. కనుక ఎవరైతే తన సహచరునితో ‘రా! మనం జూదమాడుదాం’ అని ఆహ్వానిస్తాడో, అలా ఆహ్వానించినందుకు ప్రాయశ్చితంగా అతడు దానధర్మాలు చేయాలి.