126 hadiths
అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబూ లైలా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను క’అబ్ ఇబ్న్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ను కలవడం జరిగింది. ఆయన “నేను నీకు ఒక బహుమతి ఇవ్వనా?” అన్నాడు. “ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?” అని అన్నాము. దానికి ఆయన “మీరు ఇలా పలకండి – ‘అల్లాహుమ్మ, సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లయిత అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్; అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్, వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్’ (ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శాంతిని కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శాంతిని కురిపించినావో, నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు; ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”ముస్లిం నమోదు చేసినారు: