Hadith for the World
Topic

ఫిఖ్ మరియు దాని నియమాలు

288 hadiths

288 hadiths

హుదైఫా (రదియల్లాహు అన్హు) కధనం : “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن زيد بن عاصم المازني رضي الله عنه قال: (شُكِيَ إلى النبيِّ صلى الله عليه وسلم الرَّجلُ يُخَيَّلُ إِليه أنَّه يَجِد الشَّيء في الصَّلاة، فقال: لا ينصرف حتَّى يَسمعَ صَوتًا، أو يَجِد رِيحًا).متفق عليه
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు” లేక “వేరే (ఇంకేదైనా) లక్షణంతో” అన్నారు.ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా చేస్తాడని లేక అతడి ఆకృతిని గాడిద మాదిరిగా చేస్తాడని?”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”. (కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي موسى الأشعري رضي الله عنه قال: خَسَفَت الشمس على زمان رسول الله صلى الله عليه وسلم . فقام فَزِعًا، ويخشى أن تكون الساعة، حتى أتى المسجد، فقام، فصلى بأطول قيام وسجود، ما رأيته يفعله في صلاته قطُّ، ثم قال: إن هذه الآيات التي يُرْسِلُهَا الله عز وجل : لا تكون لموت أحد ولا لحياته، ولكن الله يُرْسِلُهَا يُخَوِّفُ بها عباده، فإذا رأيتم منها شيئا فَافْزَعُوا إلى ذكر الله و دُعَائِهِ وَاسْتِغْفَارِهِ.متفق عليه
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో ప్రారంభములో “అల్లాహు అక్బర్” అని పలికినపుడు ఖుర్’ఆన్ పఠనం ప్రారంభించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉంటారు. నేను వారితో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం అగుగాక, ‘తక్బీర్’కు మరియు ‘ఖుర్ఆన్ పఠనానికి’ మధ్య మీరు ఏమి పలుకుతున్నారు?” దానికి వారు “నేను ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జీ వల్ మాఇ వల్ బరది’ అని పలుకుతాను” అన్నారు (ఓ అల్లాహ్! నన్ను నా పాపాల నుండి దూరంగా ఉంచు, ఏవిధంగానైతే నీవు తూర్పును పడమర నుండి దూరంగా ఉంచినావో; ఓ అల్లాహ్! ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా నన్ను నా పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయి; ఓ అల్లాహ్! నా పాపాలను నానుంచి నీళ్ళు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయి).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن عُمَر رضي الله عنه قال: «اسْتَأْذَنَ الْعَبَّاسُ بن عَبْدِ الْمُطَّلِب رسول الله صلى الله عليه وسلم : أن يبيت بمكة ليالي مِنى، من أجل سِقَايَتِه فأذن له».متفق عليه
అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "మృతదేహాన్ని (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకెళ్లండి ఎందుకంటే అది ధర్మపరునిదైతే, మీరు దానిని శుభానికి పంపుతున్నారు; మరి అది దానికి భిన్నమైనది అయితే, మీరు మీ మెడలో నుండి ఒక చెడును, కీడును తొలగించుకుంటున్నారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి ఆయన అతా ఇబ్న్ అబీ రబాహ్ తో ఇలా అన్నారు: "స్వర్గవాసులలోని ఒక స్త్రీని నేను నీకు చూపించనా?" దానికి అతా “తప్పనిసరిగా చూపిండి" అని అన్నారు: . అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: “ఆ నలుపు రంగు స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నేను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. దాని కారణంగా (స్పృహ తప్పి పడిపోయినపుడు) నా శరీరం (పై బట్టలు తొలగిపోయి) అనాచ్చాదితం అవుతున్నది. నా కొరకు అల్లాహ్’ ను ప్రార్థించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నువ్వు కావాలనుకుంటే (ఈ వ్యాధి పట్ల) సహనం వహించు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు; లేదా, నువ్వు కోరుకుంటే, నిన్ను స్వస్థపరచమని నేను అల్లాహ్‌ను వేడుకుంటాను.”. దానికి ఆమె ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను. అయితే మూర్ఛ స్థితిలో నేను అనాచ్ఛాదితం అవుతున్నాను. నేను అలా అనాచ్ఛాదితం కాకుండా ఉండేలా చూడమని అల్లాహ్’కు దుఆ చేయండి.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమ్మె అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై నిషేధించలేదు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."ముస్లిం నమోదు చేసినారు:
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు అన్ని సందర్భాలలో ఇస్తిఖారా నమాజ్‌ చేయుటను ఖుర్ఆన్‌లోని సూరాలు నేర్పినట్టుగా నేర్పించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు: "మీలో ఎవరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే, తప్పనిసరి ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల (ఇస్తిఖారహ్) నమాజ్ చేయాలి. తర్వాత ఇలా దువా చేయాలి: اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي، وَمَعَاشِي، وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ، ثُمَّ أَرْضِنِي» قَالَ: «وَيُسَمِّي حَاجَتَه». ("అల్లాహుమ్మ ఇన్నీ అస్'తఖీరుక బి ఇల్మిక, వ అస్తఖ్'దిరుక బి ఖుద్'రతిక, వ అస్అలుక మిల్ ఫద్'లికల్ అజీమ్, ఫఇన్నక తఖ్'దిరు వలా అఖ్'దిరు, వ తఅ్'లము వలా అఅ్'లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదాల్ అమ్'ర - (ఇక్కడ మీ విషయం ప్రస్తావించాలి) - ఖైరున్ లి ఫిద్దునియా వమఆషీ వ ఆఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు - ఆజిలిహి వ ఆజిలిహి - ఫఖ్'దుర్'హు లీ వ యస్సిర్'హు లీ థుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదల్ అమ్'ర షర్రు లీ ఫిద్దునియా వ మఆ్'షీ వ ఆ్'ఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు ఆజిలిహి వ ఆజిలిహి - ఫస్'రిఫ్'హు అ'న్నీ వస్'రిఫ్'నీ అ'న్'హు వఖ్'దుర్ లిల్ ఖైర హంథు కాన థుమ్మ అర్'దినీ బిహి) అర్థం: "అల్లాహ్, నేను నీ జ్ఞానంతో నీ సలహా అడుగుతున్నాను. నీ శక్తితో నేను నీ వద్ద బలాన్ని కోరుతున్నాను. నీ గొప్ప దయను నేను అడుగుతున్నాను. ఏదైనా నువ్వే చేయగలవు, నేనేమీ చేయలేను. నీకే సర్వం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వే గోచర, అగోచరాలన్నింటి జ్ఞానం గలవాడివి. ఓ అల్లాహ్! ఈ విషయం (తన అవసరాన్ని ఇక్కడ చెప్పాలి) నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) మంచిదని నీ జ్ఞానంలో ఉంటే, అది నా కొరకు నిర్ణయించు, సులభతరం చేయు, దానిలో నాకు శుభాలు ప్రసాదించు. ఇది నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) చెడుగా ఉంటే, దానిని నన్ను దూరం చేయు, నన్ను దాని నుండి దూరం చేయు, అది ఎక్కడ ఉన్నా నా కొరకు మంచి దానినే నిర్ణయించు, నన్ను దానితో సంతృప్తిగా ఉంచు." ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: "తన అవసరాన్ని (ఏ విషయం కోసం ఇస్తిఖారా చేస్తున్నాడో) స్పష్టంగా పేరు పెట్టి చెప్పాలి."అల్ బుఖారీ నమోదు చేసినారు:
عن أنس بن مالك رضي الله عنه قال: مرَّ النَّبي - صلى الله عليه وسلم - بامرَأَة تَبكِي عِند قَبرٍ، فقال: «اتَّقِي الله واصْبِري» فقالت: إليك عَنِّي؛ فَإِنَّك لم تُصَب بِمُصِيبَتِي ولم تَعرِفه، فقِيل لها: إِنَّه النَّبِي - صلى الله عليه وسلم - فأتت باب النبي - صلى الله عليه وسلم - فلم تجد عنده بوَّابِين، فقالت: لم أَعرِفكَ، فقال: «إِنَّما الصَّبرُ عِند الصَّدمَةِ الأُولَى». وفي رواية: «تَبكِي على صبِّي لها».متفق عليه
عن أبي سعيد الخدري رضي الله عنه مرفوعاً: «إِنَّ مِنْ أَشَرِّ النَّاسِ عِندَ الله مَنزِلَةً يَومَ القِيَامَةِ الرَّجُلَ يُفضِي إِلَى المَرْأَةِ وَتُفْضِي إِلَيه، ثُمَّ يَنشُرُ سِرَّهَا».رواه مسلم
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"ఆహ్మద్ నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు. నిశ్చయంగా కొన్నిసార్లు నేనిలా అనుకున్నాను – సలాహ్ కొరకు ఆదేశించి (అదాన్ ఇవ్వమని ఆదేశించి), సలాహ్ ప్రారంభించమని చెప్పి (ఇఖామత్ పలుకమని ఆదేశించి), ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత ఒక వ్యక్తిని కట్టెల మోపుతో నావెంట తీసుకుని బయలుదేరి, నమాజు కొరకు రాని వారి వైపునకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم : ((إن أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَلِّين من آثار الوُضُوء)). فمن اسْتَطَاع منكم أن يُطِيل غُرَّتَه فَليَفعل. وفي لفظ لمسلم: ((رأَيت أبا هريرة يتوضَّأ، فغسل وجهه ويديه حتى كاد يبلغ المنكبين، ثم غسل رجليه حتى رَفَع إلى السَّاقين، ثم قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: إنَّ أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَّلِين من آثار الوُضُوء)) فمن استطاع منكم أن يطيل غُرَّتَه وتَحْجِيلَه فَليَفعَل. وفي لفظ لمسلم: سمعت خليلي صلى الله عليه وسلم يقول: ((تَبْلُغ الحِليَة من المؤمن حيث يبلغ الوُضُوء)).الرواية الأولى: متفق عليه. الرواية الثانية: رواها مسلم. الرواية الثالثة: رواها مسلم