సద్గుణాలు మరియు పద్దతులు
అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబూ లైలా ఉల్లేఖనం : “మేము హుజైఫహ్ వద్ద కూర్చుని ఉన్నాము. అతడు నీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. ఒక మజూసీ అతనికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఎపుడైతే అతడు నీటి కప్పును అతని చేతిలో ఉంచినాడో, హుదైఫహ్ దానిని అతని పైకి విసిరినాడు. తరువాత ఇలా అన్నాడు: “అలా చేయవద్దని నేను ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అతనికి చెప్పి ఉండకపోతే...” “నేను ఇలా చేసి ఉండే వాడిని కాదు” అని అనాలని బహుశా ఆయన అనుకున్నాడు. (ఆయన ఇంకా ఇలా అన్నాడు) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను:
Available in 60 languages
«అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబూ లైలా ఉల్లేఖనం : “మేము హుజైఫహ్ వద్ద కూర్చుని ఉన్నాము. అతడు నీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. ఒక మజూసీ అతనికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఎపుడైతే అతడు నీటి కప్పును అతని చేతిలో ఉంచినాడో, హుదైఫహ్ దానిని అతని పైకి విసిరినాడు. తరువాత ఇలా అన్నాడు: “అలా చేయవద్దని నేను ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అతనికి చెప్పి ఉండకపోతే...” “నేను ఇలా చేసి ఉండే వాడిని కాదు” అని అనాలని బహుశా ఆయన అనుకున్నాడు. (ఆయన ఇంకా ఇలా అన్నాడు) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను: “పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించకండి, వెండి లేక బంగారపు పాత్రలలో నీళ్ళు త్రాగకండి, మరియు వాటితో చేసిన పళ్ళాలలో తినకండి; ఎందుకంటే (ఈ ప్రాపంచిక జీవితంలో) అవి వారి కొరకు (అవిశ్వాసుల కొరకు); మన కొరకు పరలోక జీవితంలో ఉన్నాయి.”»Meaning translation ·
Saved at original quality








