Hadith for the World
ధర్మ పద్దతులు

వస్త్రములు ధరించే పద్దతులు

8 hadiths

8 hadiths

అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబూ లైలా ఉల్లేఖనం : “మేము హుజైఫహ్ వద్ద కూర్చుని ఉన్నాము. అతడు నీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. ఒక మజూసీ అతనికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఎపుడైతే అతడు నీటి కప్పును అతని చేతిలో ఉంచినాడో, హుదైఫహ్ దానిని అతని పైకి విసిరినాడు. తరువాత ఇలా అన్నాడు: “అలా చేయవద్దని నేను ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అతనికి చెప్పి ఉండకపోతే...” “నేను ఇలా చేసి ఉండే వాడిని కాదు” అని అనాలని బహుశా ఆయన అనుకున్నాడు. (ఆయన ఇంకా ఇలా అన్నాడు) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను: “పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించకండి, వెండి లేక బంగారపు పాత్రలలో నీళ్ళు త్రాగకండి, మరియు వాటితో చేసిన పళ్ళాలలో తినకండి; ఎందుకంటే (ఈ ప్రాపంచిక జీవితంలో) అవి వారి కొరకు (అవిశ్వాసుల కొరకు); మన కొరకు పరలోక జీవితంలో ఉన్నాయి.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
عن علي بن أبي طالب رضي الله عنه مرفوعاً: «إذا انْتَعَل أحدكم فليبدأ باليمين، وإذا نَزَعَ فليبدأ بالشمال، ولْتَكُن اليُمنى أولَهُما تُنْعَل، وآخِرَهُما تُنْزَع».متفق عليه
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైతే గర్వంతో (అహంకారంతో) తన వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడుస్తాడో, పరలోకంలో అల్లాహ్ అలాంటి వారి వైపు చూడడు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «بينما رجل يمشي في حُلَّةٍ تُعْجِبُهُ نَفْسُهُ، مُرَجِّلٌ رأسه، يَخْتَالُ في مَشْيَتهِ، إذ خَسَفَ اللهُ به، فهو يَتَجَلْجَلُ في الأرض إلى يوم القيامة".متفق عليه
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఒక పురుషుడు మరో పురుషుని ‘ఔరహ్’ ను చూడరాదు. మరియు ఒక స్త్రీ మరో స్త్రీ ‘ఔరహ్’ ను చూడరాదు. అలాగే ఇద్దరు పురుషులు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు, మరియు ఇద్దరు స్త్రీలు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు.”ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి."అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు: