Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకడం విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు.

Available in 48 languages
«రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకడం విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు. నిశ్ఛయంగా ఆదము సంతానం (మానవుల) హృదయాలన్నీ ఆ దయామయుడి (అల్లాహ్) రెండు వేళ్ల మధ్యలో ఒకే ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు." తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫ్ అల్-ఖులూబ్ సర్రిఫ్ ఖులూబనా అలా తా’అతిక్ (ఓ అల్లాహ్! హృదయాలను తిప్పేవాడా, మా హృదయాలను నీ విధేయత వైపు మళ్లించు).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలిపినారు: ఆదము సంతతి (మానవుల) హృదయాలన్నీ దయామయుడైన అర్రహ్మాన్ (అల్లాహ్) యొక్క రెండు వేళ్ల మధ్యలో ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు. ఆయన తలుచుకుంటే దానిని సత్యమార్గంపై నిలుపుతాడు; లేదా తప్పుదారిలో విడిచి పెట్టేస్తాడు. హృదయాలన్నింటినీ నడిపించడం ఆయనకు ఒక్క హృదయాన్ని నడిపించడమంత సులభం. ఏ ఒక్క పని కూడా మరో పనికి ఆయన వద్ద అడ్డు తగలదు." తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫల్-ఖులూబ్! (హృదయాలను తిప్పేవాడా!) కొన్నిసార్లు ఆజ్ఞాపాలన చేసేలా, కొన్నిసార్లు అవిధేయతకు పాల్బడేలా, కొన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకునేలా, మరికొన్నిసార్లు మరచిపోయేలా హృదయాలను తిప్పే నీవు, మా హృదయాలను నీ ఆజ్ఞపాలన వైపు మాత్రమే తిప్పు."

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality