Hadith for the World
ఫిఖ్ మరియు దాని నియమాలు

ఆరాధనల ధర్మశాస్త్ర జ్ఞానం

231 hadiths

231 hadiths

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن عُمَر رضي الله عنه قال: «اسْتَأْذَنَ الْعَبَّاسُ بن عَبْدِ الْمُطَّلِب رسول الله صلى الله عليه وسلم : أن يبيت بمكة ليالي مِنى، من أجل سِقَايَتِه فأذن له».متفق عليه
అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "మృతదేహాన్ని (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకెళ్లండి ఎందుకంటే అది ధర్మపరునిదైతే, మీరు దానిని శుభానికి పంపుతున్నారు; మరి అది దానికి భిన్నమైనది అయితే, మీరు మీ మెడలో నుండి ఒక చెడును, కీడును తొలగించుకుంటున్నారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమ్మె అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై నిషేధించలేదు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."ముస్లిం నమోదు చేసినారు:
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు అన్ని సందర్భాలలో ఇస్తిఖారా నమాజ్‌ చేయుటను ఖుర్ఆన్‌లోని సూరాలు నేర్పినట్టుగా నేర్పించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు: "మీలో ఎవరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే, తప్పనిసరి ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల (ఇస్తిఖారహ్) నమాజ్ చేయాలి. తర్వాత ఇలా దువా చేయాలి: اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي، وَمَعَاشِي، وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ، ثُمَّ أَرْضِنِي» قَالَ: «وَيُسَمِّي حَاجَتَه». ("అల్లాహుమ్మ ఇన్నీ అస్'తఖీరుక బి ఇల్మిక, వ అస్తఖ్'దిరుక బి ఖుద్'రతిక, వ అస్అలుక మిల్ ఫద్'లికల్ అజీమ్, ఫఇన్నక తఖ్'దిరు వలా అఖ్'దిరు, వ తఅ్'లము వలా అఅ్'లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదాల్ అమ్'ర - (ఇక్కడ మీ విషయం ప్రస్తావించాలి) - ఖైరున్ లి ఫిద్దునియా వమఆషీ వ ఆఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు - ఆజిలిహి వ ఆజిలిహి - ఫఖ్'దుర్'హు లీ వ యస్సిర్'హు లీ థుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదల్ అమ్'ర షర్రు లీ ఫిద్దునియా వ మఆ్'షీ వ ఆ్'ఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు ఆజిలిహి వ ఆజిలిహి - ఫస్'రిఫ్'హు అ'న్నీ వస్'రిఫ్'నీ అ'న్'హు వఖ్'దుర్ లిల్ ఖైర హంథు కాన థుమ్మ అర్'దినీ బిహి) అర్థం: "అల్లాహ్, నేను నీ జ్ఞానంతో నీ సలహా అడుగుతున్నాను. నీ శక్తితో నేను నీ వద్ద బలాన్ని కోరుతున్నాను. నీ గొప్ప దయను నేను అడుగుతున్నాను. ఏదైనా నువ్వే చేయగలవు, నేనేమీ చేయలేను. నీకే సర్వం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వే గోచర, అగోచరాలన్నింటి జ్ఞానం గలవాడివి. ఓ అల్లాహ్! ఈ విషయం (తన అవసరాన్ని ఇక్కడ చెప్పాలి) నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) మంచిదని నీ జ్ఞానంలో ఉంటే, అది నా కొరకు నిర్ణయించు, సులభతరం చేయు, దానిలో నాకు శుభాలు ప్రసాదించు. ఇది నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) చెడుగా ఉంటే, దానిని నన్ను దూరం చేయు, నన్ను దాని నుండి దూరం చేయు, అది ఎక్కడ ఉన్నా నా కొరకు మంచి దానినే నిర్ణయించు, నన్ను దానితో సంతృప్తిగా ఉంచు." ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: "తన అవసరాన్ని (ఏ విషయం కోసం ఇస్తిఖారా చేస్తున్నాడో) స్పష్టంగా పేరు పెట్టి చెప్పాలి."అల్ బుఖారీ నమోదు చేసినారు:
عن أنس بن مالك رضي الله عنه قال: مرَّ النَّبي - صلى الله عليه وسلم - بامرَأَة تَبكِي عِند قَبرٍ، فقال: «اتَّقِي الله واصْبِري» فقالت: إليك عَنِّي؛ فَإِنَّك لم تُصَب بِمُصِيبَتِي ولم تَعرِفه، فقِيل لها: إِنَّه النَّبِي - صلى الله عليه وسلم - فأتت باب النبي - صلى الله عليه وسلم - فلم تجد عنده بوَّابِين، فقالت: لم أَعرِفكَ، فقال: «إِنَّما الصَّبرُ عِند الصَّدمَةِ الأُولَى». وفي رواية: «تَبكِي على صبِّي لها».متفق عليه
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"ఆహ్మద్ నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు. నిశ్చయంగా కొన్నిసార్లు నేనిలా అనుకున్నాను – సలాహ్ కొరకు ఆదేశించి (అదాన్ ఇవ్వమని ఆదేశించి), సలాహ్ ప్రారంభించమని చెప్పి (ఇఖామత్ పలుకమని ఆదేశించి), ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత ఒక వ్యక్తిని కట్టెల మోపుతో నావెంట తీసుకుని బయలుదేరి, నమాజు కొరకు రాని వారి వైపునకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم : ((إن أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَلِّين من آثار الوُضُوء)). فمن اسْتَطَاع منكم أن يُطِيل غُرَّتَه فَليَفعل. وفي لفظ لمسلم: ((رأَيت أبا هريرة يتوضَّأ، فغسل وجهه ويديه حتى كاد يبلغ المنكبين، ثم غسل رجليه حتى رَفَع إلى السَّاقين، ثم قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: إنَّ أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَّلِين من آثار الوُضُوء)) فمن استطاع منكم أن يطيل غُرَّتَه وتَحْجِيلَه فَليَفعَل. وفي لفظ لمسلم: سمعت خليلي صلى الله عليه وسلم يقول: ((تَبْلُغ الحِليَة من المؤمن حيث يبلغ الوُضُوء)).الرواية الأولى: متفق عليه. الرواية الثانية: رواها مسلم. الرواية الثالثة: رواها مسلم
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «صلاة الرجل في جماعة تَضعُفُ على صلاته في بيته وفِي سُوقِه خمسا وعشرين ضِعفًا، وذلك: أَنَّه إِذَا تَوَضَّأ، فَأَحسَن الوُضُوء، ثمَّ خرج إلى المسجد لاَ يُخرِجُهُ إلاَّ الصلاة؛ لَم يَخْطُ خُطوَةً إِلاَّ رُفِعَت له بِها درجة، وَحُطَّ عَنهُ بها خطيئة، فإذا صلَّى لم تزل الملائكة تُصَلِّي عليه، ما دام في مُصَلاَّه: اللهُمَّ صَلِّ عليه، اللهم اغفِر له، اللهم ارْحَمه، ولا يزال في صلاة ما انتظر الصلاة».متفق عليه
జైద్ ఇబ్న్ ఖాలిద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమం తప్పకుండా ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నతు నమాజు కంటే ఎక్కువగా ఏ సున్నతు నమాజును పాటించలేదు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)అబూ దావూద్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “అల్లాహ్ ఇలా పలికినాడు: ఆదము కుమారుని ఆచరణలన్నీ అతని కొరకే, ఒక్క ఉపవాసం తప్ప; అది నాకొరకు, మరియు దానికి నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను. ఉపవాసము ఒక రక్షణ కవచం వంటిది. మీలో ఎవరైనా ఏరోజైనా ఉపవాసం ఉన్నట్లైతే, అతను అసభ్యకరంగా ప్రవర్తించరాదు మరియు పెద్ద గొంతుకతో మాట్లాడరాదు. ఒకవేళ ఎవరైనా అతనిని అవమానించినా, అతనితో వాదనకు లేక జగడానికి దిగినా అతడు "నేను ఉపవాసం ఉన్న వాడను" అని చెప్పాలి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆత్మఉన్నదో, ఆయన సాక్షిగా, ఉపవాసం ఉన్న వ్యక్తి యొక్క నోటి వాసన కస్తూరి సుగంధం కంటే అల్లాహ్ వద్ద మరింత ఆహ్లాదకరమైనది. ఉపవాసం ఉన్న వ్యక్తికి రెండు ఆనందాలు ఉన్నాయి. అవి అతన్ని సంతోషపరుస్తాయి; అతడు తన ఉపవాసం విరమించినప్పుడు అతడు సంతోషిస్తాడు మరియు అతడు తన ప్రభువును కలుసుకున్నప్పుడు, అతను తన ఉపవాసం గురించి ఆనందిస్తాడు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال: «يَغْفِرُ الله للشَّهيد كُلَّ شيءٍ إلا الدَّين». وفي رواية له: «القَتْل في سَبِيل الله يُكَفِّر كلَّ شيءٍ إلا الدَّين».رواه مسلم
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: “పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”.ముస్లిం నమోదు చేసినారు:
షురైహ్ ఇబ్న్ హానీ ఉల్లేఖన: “నేను ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ఇలా ప్రశ్నించాను “ఇంటిలోనికి ప్రవేశిస్తూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఏమి చేసేవారు?” అని. దానికి ఆమె (ర) “వారు ముందుగా ‘సివాక్’ (పలుదోముపుల్ల) ఉపయోగించేవారు” అని సమాధానమిచ్చారు.”ముస్లిం నమోదు చేసినారు:
عن ابن مسعود رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «أيُّكم مالُ وارثِه أحَبُّ إليه من مالَه؟» قالوا: يا رسول الله، ما منَّا أحد إلا مَالُه أحَبُّ إليه. قال: «فإن مالَه ما قدَّم، ومالُ وارثِه ما أخَّر».رواه البخاري