Hadith for the World
Topic

సద్గుణాలు మరియు పద్దతులు

288 hadiths

288 hadiths

అబూహురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు: “అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ అల్లదీ హువ ఇస్మతు అమ్రీ; వ అస్లిహ్’లీ దున్యాయా, అల్లతీ ఫీహా మఆషీ; వ అస్లిహ్’లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ; వ అజ్’అలిల్ హయాత జియాదతన్’లీ ఫీ కుల్లి ఖైరిన్; వజ్’అలిల్ మౌత రాహతన్’లీ మిన్ కుల్లి షర్రిన్”; (ఓ అల్లాహ్! నా ధర్మాన్ని (నా ధర్మానుసరణను) నా కొరకు సరిచేయి - ఎందులోనైతే నా రక్షణ ఉన్నదో; మరియు నా ఈ ప్రపంచాన్ని సరిచేయి - ఎందులోనైతే నా జీవనం ఉన్నదో; మరియు శుభప్రదమైన ప్రతి దానిలోనూ నా జీవనాన్ని పొడిగించు; మరియు వినాశనాన్ని కలిగించే ప్రతి దానిలోనూ మరణాన్ని నాకు ప్రశాంతత కలిగించే దానిలా చేయి”.ముస్లిం నమోదు చేసినారు:
అబూ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేస్తూ ఉండేవారు: “రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్” (ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయమూ ప్రతి సాయంత్రమూ ఈ దుఆ పఠించకుండా ఎప్పుడూ వదిలి వేయలేదు: “అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ వల్ ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, అవ్: వ ఆమిన్ రౌఆతీ, అల్లాహుమ్మహ్’ఫజ్’నీ మింబైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వ అన్’యమీనీ, వ అన్’షిమాలీ, వమిన్ ఫౌఖీ; వ అఊదు బిఅజ్’మతిక అన్ ఉగ్’తాల మిన్ తహ్’తీ” (ఓ అల్లాహ్, నేను నిన్ను ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని కోరుతున్నాను; ఓ అల్లాహ్, నేను నిన్ను క్షమించమని మరియు నా ధర్మములో, నా ప్రాపంచిక జీవితంలో, నా కుటుంబంలో మరియు నా సంపదలో శ్రేయస్సు ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నా తప్పులను కప్పివేసి, నా భయాన్ని తగ్గించు; ఓ అల్లాహ్! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి మరియు నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. మరియు నా క్రింద నుండి హఠాత్తుగా చంపబడకుండా నేను నీ ఘనతను, గొప్పతనాన్ని ఆశ్రయిస్తున్నాను.)అబూ దావూద్, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించినారు: “ఇది రసూలిల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆలలో ఒకటి: “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక” (ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పదాలతో దుఆ చేసేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది. నీకు మేలు చేసే దానిని పట్టుకుని ఉండు. సహాయం కోసం అల్లాహ్’ను అడుగు. మరియు నిన్ను నీవు నిస్సహాయునిగా భావించుకోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం జరిగితే, "నేను ‘ఒకవేళ’ ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది" అని అనకు. అలాకాక "ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ; అల్లాహ్ తాను కోరినది చేస్తాడు" అని పలుకు. నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే మాట షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది.ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: «الْمُؤْمِنُ مِرْآةُ أَخِيهِ الْمُؤْمِنِ».رواه أبو داود والترمذي
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని, అబూ దర్దాఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.ముస్లిం నమోదు చేసినారు:
అన్నో’మాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” తరువాత ఆయన ఈ ఆయతును పఠించినారు: {“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను.నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు".} [గాఫిర్ 40:60]అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది: “నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”ముస్లిం నమోదు చేసినారు:
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
షద్దాద్ ఇబ్న్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా పలికినారు: సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్మల త్రాసులో భారమైనవి మరియు అనంత కరుణామయునికి అత్యంత ప్రియమైనవి. అవి ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు మరియు అన్ని రకాల స్తోత్రములు, ప్రశంసలు కేవలం ఆయన కొరకే శోభిస్తాయి); మరియు ‘సుబ్’హానల్లాహిల్ అజీం’ (మహోన్నతుడైన అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”.అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబీ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, వారు ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ముఆవియహ్ ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు. నిశ్చయంగా, నేను కేవలం చేరవేసే వాడిని మాత్రమే. ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. (గుర్తుంచుకోండి) ఈ ఉమ్మత్ (కల్మషము లేని విశ్వాసము గలవారు) అల్లాహ్ యొక్క బోధనలు, ఆదేశలపై దృఢంగా మరియు స్థిరంగా నిలిచి యుండుట, అనుసరించుట ఎన్నటికీ విడనాడదు. ప్రళయ ఘడియ స్థాపితమయ్యేంత వరకు వేర్వేరు మార్గాలను (ధర్మాలను) అనుసరించేవారు వీరికి ఎటువంటి హాని కలుగజేయలేరు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ సలాం రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి తరలి వచ్చినపుడు ప్రజలు ఆయనను చూడడానికి తండోపతండాలుగా వెళ్ళారు. ప్రజలు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు” అని మూడు సార్లు అన్నారు. నేను వారితో కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడడానికి వచ్చాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడటానికి ప్రజలతో వచ్చాను; ఆయన ముఖం స్పష్టంగా చూసిన వెంటనే “ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదు” అని నాకు తెలిసిపోయింది. ఆయన నుండి ప్రత్యక్షంగా నేను విన్న మొట్టమొదటి మాటలు ఇవి: “ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
عن أنس رضي الله عنه أنه قَالَ لِثابِتٍ رحمه اللهُ: ألاَ أرْقِيكَ بِرُقْيَةِ رسولِ اللهِ صلى الله عليه وسلم ؟ قال: بلى، قال: «اللَّهُمَّ رَبَّ النَّاسِ، مُذْهِبَ البَأسِ، اشْفِ أنْتَ الشَّافِي، لاَ شَافِيَ إِلاَّ أنْتَ، شِفَاءً لاَ يُغَادِرُ سَقماً».رواه البخاري
సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “నిశ్చయంగా దైవభీతిపరుడిని, భయభక్తులు కలవాడిని, (అనవసరమైన) వాంఛలు, కోరికలు లేని వాడిని, మరియు గుంభనముగా ఉండేవాడిని అల్లాహ్ ప్రేమిస్తాడు”.ముస్లిం నమోదు చేసినారు:
عن ثوبان رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قَالَ: "إنَّ المسلِمَ إذا عادَ أخاه المسلِمَ، لم يَزَلْ في خُرْفَةِ الجَنَّةِ حتى يرجعَ"، قيل: يا رسولَ اللهِ ما خُرْفَةُ الجنَّةِ؟، قال: "جَنَاها".رواه مسلم
عن أنس بن مالك رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم أنه كان إذا أكل طعاما، لعق أصابعه الثلاث. قال: وقال: «إذا سقطت لُقمة أحدكم فليُمِطْ عنها الأذى، وليأكلها ولا يَدَعْهَا للشيطان» وأمر أن تُسْلَتَ القَصْعَةُ، قال: «فإنكم لا تدرون في أيِّ طعامكم البركة» وعن جابر بن عبد الله رضي الله عنه أن رسولَ اللهِ صلى الله عليه وسلم قالَ: "إنّ الشيطانَ يَحضُرُ أحدَكُم عندَ كلِ شيءٍ من شَأنِه، حتى يَحضُرَهُ عندَ طعامِهِ، فإذا سَقطتْ لقمةُ أحدِكُم فليَأخُذْها فَلْيُمِطْ ما كانِ بها من أذى، ثم ليَأكُلْها ولا يَدَعْها للشيطانِ، فإذا فَرَغَ فليَلْعَقْ أصابعَهُ، فإنه لا يَدري في أيِّ طَعامه البركة"حديث أنس رواه مسلم. حديث جابر رواه مسلم
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు