Hadith for the World
Topic

సద్గుణాలు మరియు పద్దతులు

288 hadiths

288 hadiths

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: "బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: "لِيُسَلِّمِ الصغيرُ على الكبيرِ، والمارُّ على القاعدِ، والقليلُ على الكثيرِ" وفي رواية: "والراكبُ على الماشي".متفق عليه
అబీ మస్'ఊద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది" అన్నారు.ముస్లిం నమోదు చేసినారు:
عن علي بن أبي طالب رضي الله عنه مرفوعاً: «إذا انْتَعَل أحدكم فليبدأ باليمين، وإذا نَزَعَ فليبدأ بالشمال، ولْتَكُن اليُمنى أولَهُما تُنْعَل، وآخِرَهُما تُنْزَع».متفق عليه
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు".అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు: “బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైతే గర్వంతో (అహంకారంతో) తన వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడుస్తాడో, పరలోకంలో అల్లాహ్ అలాంటి వారి వైపు చూడడు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال: «من الكبائر شَتْمُ الرجل والديه» قيل: وهل يسبّ الرجل والديه؟ قال: «نعم، يسبّ أبا الرجل فيسبّ أباه، ويسبّ أمّه، فيسبّ أمّه».متفق عليه
అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబూ లైలా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను క’అబ్ ఇబ్న్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ను కలవడం జరిగింది. ఆయన “నేను నీకు ఒక బహుమతి ఇవ్వనా?” అన్నాడు. “ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?” అని అన్నాము. దానికి ఆయన “మీరు ఇలా పలకండి – ‘అల్లాహుమ్మ, సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లయిత అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్; అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్, వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్’ (ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శాంతిని కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శాంతిని కురిపించినావో, నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు; ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “’సజ్దా’ (సాష్టాంగ ప్రమాణము) చేసినపుడు (ఆ స్థితిలో) దాసుడు తన ప్రభువుకు అతి చేరువగా ఉంటాడు. కనుక ‘సజ్దా’ స్థితిలో మరింత ఎక్కువగా ఆయనను వేడుకొనండి”.ముస్లిం నమోదు చేసినారు:
عن أبي أمامة رضي الله عنه قال: سمعتُ رسولَ اللهِ صلى الله عليه وسلم يقولُ: «اقْرَؤُوا القرْآنَ؛ فَإنَّهُ يَأتِي يَوْمَ القِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ».رواه مسلم
عن أبي ذر الغفاري رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «ألاَ أُخْبِرُكَ بِأَحَبِّ الكَلاَمِ إِلَى اللهِ؟ إنَّ أَحَبَّ الكلام إِلى الله: سبحان اللهِ وبحمدِهِ».رواه مسلم
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన పొరుగు వాని పట్ల ఔదార్యము, ఉదార వైఖరి కలిగి ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన అతిథికి (వీలైనంతలో) ఆదరపూర్వకం గా అతిథి సత్కారాలు చేయాలి”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రెండు గొప్ప అనుగ్రహాలు ఉన్నాయి, వీటి విషయంలో చాలా మంది మనుషులు (నిర్లక్ష్యం వలన) నష్టపోతారు: ఇవి ఆరోగ్యం మరియు తీరిక సమయం.అల్ బుఖారీ నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «والذي نفسي بيده، لو لم تذنبوا، لذهب الله بكم، وجاء بقوم يُذْنِبُونَ، فيستغفرون اللهَ تعالى، فيغفر لهم».رواه مسلم
عن عبد الله بن مسعود رضي الله عنه مرفوعاً: «يُؤْتَى بجهنم يومئذ لها سبعون ألف زِمَامٍ مع كل زمام سبعون ألف ملك يَجُرُّونَهَا».رواه مسلم
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త ముహమ్మద్ ﷺ తన సజ్దాలో ఇలా ప్రార్థించేవారు: "అల్లాహ్‌మ్మగ్ఫిర్లీ దంబీ కుల్లహు;దిఖ్ఖహు వజిల్లహు; వ అవ్వలుహు, వ ఆఖిరహు; వ అలానియ్యతహు, వ సిర్రహు. (ఓ అల్లాహ్! నా మొత్తం పాపాలను క్షమించు — అవి చిన్నవైనా, పెద్దవైనా, మొదటివైనా, చివరివైనా, ప్రత్యక్షంగా చేసినవైనా, రహస్యంగా చేసినవైనా."ముస్లిం నమోదు చేసినారు:
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా” అన్నారు. మరియు 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా నరకంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నోటి కారణంగా మరియు జననేంద్రియాల కారణంగా” అని సమాధాన మిచ్చినారు”.అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
عن أبي سعيد الخدري رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : "الْبَاقِيَاتُ الصَّالِحَاتُ، لَا إلَهَ إلَّا اللَّهُ، وَسُبْحَانَ اللَّهِ، وَاَللَّهُ أَكْبَرُ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إلَّا بِاَللَّهِ".رواه ابن حبان والحاكم، أما النسائي فرواه في الكبرى لكن من حديث أبي هريرة
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు: