Hadith for the World
సద్గుణాలు మరియు పద్దతులు

గుణాలను అర్ధం చేసుకోవటం

56 hadiths

56 hadiths

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: "బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ మస్'ఊద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది" అన్నారు.ముస్లిం నమోదు చేసినారు:
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال: «من الكبائر شَتْمُ الرجل والديه» قيل: وهل يسبّ الرجل والديه؟ قال: «نعم، يسبّ أبا الرجل فيسبّ أباه، ويسبّ أمّه، فيسبّ أمّه».متفق عليه
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన పొరుగు వాని పట్ల ఔదార్యము, ఉదార వైఖరి కలిగి ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన అతిథికి (వీలైనంతలో) ఆదరపూర్వకం గా అతిథి సత్కారాలు చేయాలి”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా” అన్నారు. మరియు 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా నరకంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నోటి కారణంగా మరియు జననేంద్రియాల కారణంగా” అని సమాధాన మిచ్చినారు”.అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: «الْمُؤْمِنُ مِرْآةُ أَخِيهِ الْمُؤْمِنِ».رواه أبو داود والترمذي
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని, అబూ దర్దాఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.ముస్లిం నమోదు చేసినారు:
బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది: “నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “నిశ్చయంగా దైవభీతిపరుడిని, భయభక్తులు కలవాడిని, (అనవసరమైన) వాంఛలు, కోరికలు లేని వాడిని, మరియు గుంభనముగా ఉండేవాడిని అల్లాహ్ ప్రేమిస్తాడు”.ముస్లిం నమోదు చేసినారు:
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దౌర్జన్యము, అణచివేతలకు పాల్బడుట పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే నిశ్చయంగా దౌర్జన్యము, అణచివేతలు ప్రళయదినమునాడు పొరలు కలిగిన అంధకారమై నిలుస్తుంది; పిసినారితనం పట్ల జాగ్రత్తగా ఉండంది, నిశ్చయంగా పిసినారితనం మీకు పూర్వం గతించిన వారిని నాశనం చేసింది; అది వారిని రక్తం చిందించేలా ప్రేరేపించింది; నిషేధించబడిన వాటిని (హరాం విషయాలను); అనుమతించుకునేలా చేసింది (హలాల్ చేసుకునేలా చేసింది)”.ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత అలంకృతం చేస్తుంది. అలాగే ఏ విషయంలో నుండి అయినా వీటిని తొలిగించి వేస్తే అది లోపభూయిష్టం అవుతుంది.”ముస్లిం నమోదు చేసినారు:
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”.అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీల, అసభ్య వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆయనెప్పుడూ అశ్లీల, అసభ్య భాషను ఉపయోగించలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ దుష్ఠునికి, దౌర్జన్యపరునికి (వెంటనే శిక్షించక) కొంత గడువునిస్తాడు. అయితే, ఆయన అతడిని పట్టుకున్నపుడు, ఇక అతడిని విడిచిపెట్టడు.” అపుడు ఆయన (ప్రవక్త (స) ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది.” (హూద్: 11:102)అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «بينما رجل يمشي في حُلَّةٍ تُعْجِبُهُ نَفْسُهُ، مُرَجِّلٌ رأسه، يَخْتَالُ في مَشْيَتهِ، إذ خَسَفَ اللهُ به، فهو يَتَجَلْجَلُ في الأرض إلى يوم القيامة".متفق عليه
అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఆకలిగొన్నవారికి అన్నంపెట్టండి, వ్యాధిగ్రస్తులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి»అల్ బుఖారీ నమోదు చేసినారు:
عن عبد الله بن مسعود رضي الله عنه عن النبيِّ صلى الله عليه وسلم ، قَالَ: «لا يدخلُ الجنةَ مَن كان في قلبه مِثقال ذرةٍ من كِبر» فقال رجل: إنّ الرجلَ يحب أن يكون ثوبه حسنا، ونَعله حسنة؟ قال: «إنّ الله جميلٌ يحب الجمالَ، الكِبر: بَطَرُ الحق وغَمْطُ الناس».رواه مسلم
సమురా ఇబ్న్ జుందుబ్ మరియు ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”ముస్లిం తన ముఖద్దిమాలో నమోదు చేసినారు: