62 hadiths
అబూ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేస్తూ ఉండేవారు: “రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్”
(ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయమూ ప్రతి సాయంత్రమూ ఈ దుఆ పఠించకుండా ఎప్పుడూ వదిలి వేయలేదు: “అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ వల్ ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, అవ్: వ ఆమిన్ రౌఆతీ, అల్లాహుమ్మహ్’ఫజ్’నీ మింబైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వ అన్’యమీనీ, వ అన్’షిమాలీ, వమిన్ ఫౌఖీ; వ అఊదు బిఅజ్’మతిక అన్ ఉగ్’తాల మిన్ తహ్’తీ”
(ఓ అల్లాహ్, నేను నిన్ను ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని కోరుతున్నాను; ఓ అల్లాహ్, నేను నిన్ను క్షమించమని మరియు నా ధర్మములో, నా ప్రాపంచిక జీవితంలో, నా కుటుంబంలో మరియు నా సంపదలో శ్రేయస్సు ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నా తప్పులను కప్పివేసి, నా భయాన్ని తగ్గించు; ఓ అల్లాహ్! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి మరియు నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. మరియు నా క్రింద నుండి హఠాత్తుగా చంపబడకుండా నేను నీ ఘనతను, గొప్పతనాన్ని ఆశ్రయిస్తున్నాను.)అబూ దావూద్, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
షద్దాద్ ఇబ్న్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా పలికినారు: సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”అల్ బుఖారీ నమోదు చేసినారు: