Hadith for the World
Topic

అల్ అఖీద

135 hadiths

135 hadiths

అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.అత్తిర్మిదీ నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «لما خلق اللهُ الخَلْقَ كتب في كتاب، فهو عنده فوق العرش: إن رحمتي تَغْلِبُ غضبي». وفي رواية: «غَلَبَتْ غضبي» وفي رواية: «سَبَقَتْ غضبي».متفق عليه
ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ సిర్మహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”.అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడిగా పరిగణించబడడు).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي أمامة رضي الله عنه قال: سمعتُ رسولَ اللهِ صلى الله عليه وسلم يقولُ: «اقْرَؤُوا القرْآنَ؛ فَإنَّهُ يَأتِي يَوْمَ القِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ».رواه مسلم
عن جابر بن عبد الله رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم : «يُبْعَثُ كلُّ عبدٍ على ما مات عليه».رواه مسلم
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది. నీకు మేలు చేసే దానిని పట్టుకుని ఉండు. సహాయం కోసం అల్లాహ్’ను అడుగు. మరియు నిన్ను నీవు నిస్సహాయునిగా భావించుకోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం జరిగితే, "నేను ‘ఒకవేళ’ ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది" అని అనకు. అలాకాక "ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ; అల్లాహ్ తాను కోరినది చేస్తాడు" అని పలుకు. నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే మాట షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది.ముస్లిం నమోదు చేసినారు:
عن أنس بن مالك رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم أنه كان إذا أكل طعاما، لعق أصابعه الثلاث. قال: وقال: «إذا سقطت لُقمة أحدكم فليُمِطْ عنها الأذى، وليأكلها ولا يَدَعْهَا للشيطان» وأمر أن تُسْلَتَ القَصْعَةُ، قال: «فإنكم لا تدرون في أيِّ طعامكم البركة» وعن جابر بن عبد الله رضي الله عنه أن رسولَ اللهِ صلى الله عليه وسلم قالَ: "إنّ الشيطانَ يَحضُرُ أحدَكُم عندَ كلِ شيءٍ من شَأنِه، حتى يَحضُرَهُ عندَ طعامِهِ، فإذا سَقطتْ لقمةُ أحدِكُم فليَأخُذْها فَلْيُمِطْ ما كانِ بها من أذى، ثم ليَأكُلْها ولا يَدَعْها للشيطانِ، فإذا فَرَغَ فليَلْعَقْ أصابعَهُ، فإنه لا يَدري في أيِّ طَعامه البركة"حديث أنس رواه مسلم. حديث جابر رواه مسلم
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. రాత్రి ఆయన చంద్రుని వైపు చూసినారు – అంటే పూర్ణ చంద్రుడిని – చూసి ఇలా అన్నారు: “నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు. కనుక సూర్యుడు ఉదయించడానికి ముందు నమాజును (ఫజ్ర్ నమాజును) మరియు అతడు అస్తమించడానికి ముందు నమాజును (అస్ర్ నమాజును) ఆచరించకుండా ఉండేలా చేసే దేనినైనా, మిమ్మల్ని లొంగదీసుకోకుండా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటే అలా చేయండి (అంటే ఆ నమాజులను వదలకుండా ఆచరించండి)”. తరువాత వారు ఈ ఆయతును పఠించినారు “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ దుష్ఠునికి, దౌర్జన్యపరునికి (వెంటనే శిక్షించక) కొంత గడువునిస్తాడు. అయితే, ఆయన అతడిని పట్టుకున్నపుడు, ఇక అతడిని విడిచిపెట్టడు.” అపుడు ఆయన (ప్రవక్త (స) ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది.” (హూద్: 11:102)అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో కొందరు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: (సహీహ్ ముస్లింలోని ఇదే హదీసులో హఫ్సహ్ బింత్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖించినట్లుగా పేర్కొనబడింది): “ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు’మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.దాన్ని అబ్దుర్రజ్జాఖ్ ఉల్లేఖించారు
عن البراء بن عازب –رضي الله عنهما- قال: كانَ رجلٌ يَقرَأُ سُورةَ الكهفِ، وعندَه فَرَسٌ مَربُوطٌ بِشَطَنَيْنِ، فَتَغَشَّتْهُ سَحَابَةٌ فَجَعَلَتْ تَدْنُو، وجَعلَ فَرَسُه يَنفِرُ منها، فلمّا أصبحَ أتَى النبيَّ صلى الله عليه وسلم فَذَكرَ ذلك له، فقالَ: «تِلكَ السَّكِينةُ تَنَزَّلَتْ للقُرآنِ».متفق عليه
అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను (వచనాలను) కంఠస్థం చేస్తారో, వారు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించబడతారు." మరొక రివాయతులో "సూరతుల్ కహఫ్ యొక్క చివరి పది ఆయతులు." అని ఉంది.ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «ما توطَّنَ رجلٌ مسلمٌ المساجدَ للصلاة والذِّكر، إلا تَبَشْبَشَ اللهُ له، كما يَتَبَشْبَشُ أهلُ الغائب بغائبهم إذا قَدِمَ عليهم».رواه ابن ماجه وأحمد
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలికినాడు: ‘ఎవరైతే నా వలీ పట్ల (వలీ – ధర్మనిష్టాపరుడైన అల్లాహ్ యొక్క దాసుడు) శతృత్వం వహిస్తాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే అతనిపై ‘ఫర్జ్’ చేసినానో అది నాకు అత్యంత ఇష్టమైనది; నా దాసుడు దాని ద్వారా తప్ప నాకు చేరువ కాలేడు. ఇంకా అతడు ‘నఫీల్’ ఆచరణలు ఆచరిస్తూ నాకు ఇంకా చేరువ అవుతూనే ఉంటాడు, ఎంతగా అంటే, నేను అతడిని ప్రేమించేంత వరకు. నేను అతడిని ప్రేమించినట్లయితే నేను అతడి వినికిడి శక్తినవుతాను, దేని ద్వారానైతే అతడు వింటాడో, నేను అతడి దృష్టినవుతాను, దేనిద్వారానైతే అతడు చూడగలుగుతాడో, నేను అతడి చేతినవుతాను, దేని ద్వారానైతే అతడు (శత్రువులను) ప్రతాడించుతాడో, నేను అతడి కాలునవుతాను, దేని ద్వారానైతే అతడు నడుస్తాడో. అతడు దేని కొరకైనా అర్థించినట్లయితే, నేను అతనికి తప్పనిసరిగా ప్రసాదిస్తాను; అతడు నా నుండి రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ ప్రసాదిస్తాను. ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు అతనికి కష్టం కలిగించడాన్ని నేను ఇష్టపడను.”అల్ బుఖారీ నమోదు చేసినారు:
عن أنس بن مالك وأبي هريرة رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم فيما يرويه عن ربه عز وجل قال: «إذا تَقَرَّبَ العبدُ إليَّ شِبْرًا تَقَرَّبْتُ إليه ذِرَاعًا، وإذا تَقَرَّبَ إليَّ ذِرَاعًا تَقَرَّبْتُ مِنْهُ بَاعًا، وإذا أتاني يمشي أَتَيْتُهُ هَرْوَلَةً».حديث أنس -رضي الله عنه- رواه البخاري . حديث أبي هريرة -رضي الله عنه- متفق عليه
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అదీ ఇబ్న్ హాతిం (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లా బిన్ ఉకైమ్’రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఎవరైతే తావీజులా ఏదైనా వస్తువు ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు
తారిఖ్ ఇబ్న్ అషీం అల్ అష్జఈ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము).ముస్లిం నమోదు చేసినారు: