Hadith for the World
Topic

సద్గుణాలు మరియు పద్దతులు

288 hadiths

288 hadiths

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు.ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి, రసూలుల్లాల్ సల్లల్లాహు అలైహి వసల్లం తో మక్కా నగరానికి వెళ్ళే దారిపై ప్రయాణిస్తుండగా, ‘జుమ్’దాన్’ అని పిలవబడే ఒక పర్వతం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అపుడు ఆయన ఇలా అన్నారు: “కదలండి ముందుకు, ఇది ‘జుమ్’దాన్’ (పర్వతం); ‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు”. ఆయన వెంట ఉన్న వారు “ముఫర్రిదూన్ అంటే ఎవరు ఓ రసూలల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ఆయన: “అల్లాహ్’ను అధికంగా స్మరించే పురుషులు, మరియు అల్లాహ్’ను అధికంగా స్మరించే స్త్రీలు” అన్నారు.ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు). (చనిపోయిన) తరువాత అతడు అల్లాహ్ ను కలిసినపుడు, అల్లాహ్ అతడి పాపాలను ఉపేక్షించి ఉంటాడు".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
సా’ద్ ఇబ్న్ అబీ వఖ్'ఖా స్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేకపోతున్నారా?" అక్కడ కూర్చుని ఉన్న వారిలో ఒకరు ఇలా అడిగారు: “మాలో ఎవరైనా ఒక రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలరు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తూ వంద సార్లు “సుబ్’హానల్లాహ్” అనండి. తద్వారా మీ కొరకు వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, లేదా వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి” అన్నారు.”ముస్లిం నమోదు చేసినారు:
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “మరణానికి మూడు దినముల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ మూసా అల్ అష్’అరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించు వాడు మరియు తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించని వాడు – వీరిరువురి ఉదాహరణ జీవించి ఉన్న మరియు మరణించిన వానికి మధ్య ఉన్న పోలిక వంటిది”; సహీహ్ ముస్లింలో ఈ హదీథు పదాలు ఇలా ఉన్నాయి: “ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగుతుందో, మరియు ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగదో, ఆ రెంటి ఉదాహరణ జీవించి ఉన్న వానికి మరియు మరణించిన వానిని పోలియున్నది”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه قال: جاء رجل إلى رسول الله صلى الله عليه وسلم فقال: يا رسول الله، مَنْ أحقُّ الناس بِحُسن صَحَابَتِي؟ قال: «أمك» قال: ثم مَنْ ؟ قال: «أمك»، قال: ثم مَنْ؟ قال: «أمك»، قال: ثم مَنْ؟ قال: «أبوك». متفق عليه. وفي رواية: يا رسول الله، مَنْ أحقُّ بحُسْنِ الصُّحْبَةِ؟ قال: «أمك، ثم أمك، ثم أمك، ثم أباك، ثم أدْنَاك أدْنَاك».الرواية الأولى: متفق عليها. الرواية الثانية: رواها مسلم
అనస్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం: ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «من رآني في المنام فَسَيَرَانِي في اليَقظة -أو كأنما رآني في الْيَقَظَةِ- لا يَتَمَثَّلُ الشيطان بي».متفق عليه. مسلم
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ అబా సయీద్! ఎవరైతే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా సంతృప్తి చెందుతారో, వారికి స్వర్గం హామీ ఇవ్వబడుతుంది." అబూ సయీద్ దానితో ఆశ్చర్యపోయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: ఓ రసూలల్లాహ్! దానిని నా కొరకు పునరావృతం చేయండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా పునరావృతం చేసి, ఇంకా ఇలా పలికినారు: "స్వర్గంలో దాసుడి స్థానాన్ని వంద స్థాయిలు పెంచే మరొక విషయం కూడా ఉంది; ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం భూమ్యాకాశాల మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అతను ఇలా అడిగినారు: "ఓ రసూలల్లాహ్! అది ఏమిటి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ కొరకు ధర్మపోరాటం, అల్లాహ్ కొరకు ధర్మపోరాటం."ముస్లిం నమోదు చేసినారు:
వహ్’షియ్యిబ్ని హర్బ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము తింటున్నాము కానీ కడుపు నిండినట్లు ఉండడం లేదు.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారు కావచ్చు?” దానికి వారు: “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు:“కలిసి భోజనం చేయండి, ఆహారంపై అల్లాహ్ నామాన్ని స్మరించండి, అందులో మీకు శుభం కలుగుతుంది.”అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
عن أنس رضي الله عنه مرفوعاً: «يَتْبَعُ الميتَ ثلاثةٌ: أهْلُه ومَالُه وعَمَلُه، فيرجع اثنان ويَبْقى واحد: يرجع أهْلُه ومَالُه، ويبقى عَمَلُه».متفق عليه
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.” సహీహ్ బుఖారీలో: “చిన్న వారు (వయసులో) పెద్దవారికి; పాదచారుడు కూర్చుని ఉన్న వానికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి” అని నమోదు చేయబడి ఉన్నది.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أنس بن مالك رضي الله عنه مرفوعاً: «يُؤتى بأنعم أهل الدنيا من أهل النار يوم القيامة، فَيُصْبَغُ في النار صَبْغَةً، ثم يقال: يا ابن آدم، هل رأيت خيرًا قطُّ؟ هل مَرَّ بك نَعِيمٌ قطُّ؟ فيقول: لا والله يا رب، وَيُؤْتَى بأشدِّ الناس بُؤسًا في الدنيا من أهل الجَنَّة، فَيُصْبَغُ صَبْغَةً في الجنَّة، فيقال له: يا ابن آدم، هل رأيت بُؤسًا قط؟ هل مَرَّ بك شِدَّةٌ قط؟ فيقول: لا والله، ما مَرَّ بي بُؤْسٌ قطٌّ، ولا رأيت شِدةً قَطُّ».رواه مسلم
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «جَعَلَ اللهُ الرحمةَ مائة جُزْءٍ، فَأَمْسَكَ عِنْدَهُ تِسْعَةً وَتِسْعِينَ، وأَنْزَلَ في الأَرْضِ جُزْءًا وَاحِدًا، فَمِنْ ذَلِكَ الجُزْءِ يَتَرَاحَمُ الخَلَائِقُ، حتى تَرْفَعَ الدَّابَّةُ حَافِرَهَا عَنْ وَلَدِهَا خَشْيَةَ أَنْ تُصِيبَهُ». وفي رواية «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ، أَنْزَلَ منها رحمةً واحدةً بَيْنَ الجِنِّ والإنسِ والبَهَائِمِ والهَوَامِّ، فَبِهَا يَتَعَاطَفُونَ، وبها يَتَرَاحَمُونَ، وبِهَا تَعْطِفُ الوَحْشُ على وَلَدِهَا، وأَخَّرَ اللهُ تعالى تِسْعًا وتِسْعِينَ رحمةً يَرْحَمُ بِهَا عِبَادَهُ يومَ القِيَامَةِ». وعن سلمان الفارسي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ فمنها رحمةٌ يَتَرَاحَمُ بها الخَلْقُ بَيْنَهُمْ، وتِسْعٌ وتِسْعُونَ لِيَومِ القِيَامَةِ». وفي رواية: «إِنَّ اللهَ تَعَالَى خَلَقَ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ والأَرْضَ مئةَ رحمةٍ كُلُّ رحمةٍ طِبَاقَ مَا بَيْنَ السَّمَاءِ إلى الأَرْضِ، فَجَعَلَ منها في الأَرْضِ رَحْمَةً فبها تَعْطِفُ الوَالِدَةُ على وَلَدِهَا، والوَحْشُ والطَّيْرُ بَعْضُهَا عَلَى بَعْضٍ، فإذا كانَ يومُ القيامةِ أَكْمَلَهَا بِهَذِه الرحمةِ».حديث أبي هريرة -رضي الله عنه-: متفق عليه. حديث سلمان -رضي الله عنه-: رواه مسلم
అబూ దర్, జున్దుబ్ బిన్ జునాదా, అబూ అబ్దిర్రహ్మాన్ మరియు ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు అన్హుమ్ ల ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికిననారు "మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్‌ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨అత్తిర్మిదీ నమోదు చేసినారు:
అన్’నవ్వాస్ ఇబ్న్ సిమ్’ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మం మరియు పాపం గురించి అడిగాను, వారు ఇలా జవాబిచ్చారు: "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”.ముస్లిం నమోదు చేసినారు:
عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «للَّهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضِ فَلاَةٍ». وفي رواية: «لَلَّهُ أَشَدُّ فَرَحًا بِتَوْبَةِ عَبْدِهِ حِينَ يَتُوبُ إِلَيْهِ، مِنْ أَحَدِكُمْ كَانَ عَلَى رَاحِلَتِهِ بِأَرْضِ فَلَاةٍ، فَانْفَلَتَتْ مِنْهُ وَعَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ، فَأَيِسَ مِنْهَا، فَأَتَى شَجَرَةً، فَاضْطَجَعَ فِي ظِلِّهَا، وقَدْ أَيِسَ مِنْ رَاحِلَتِهِ، فَبَيْنَا هُوَ كَذَلِكَ إِذَا هُوَ بِهَا، قَائِمَةً عِنْدَهُ، فَأَخَذَ بِخِطَامِهَا، ثُمَّ قَالَ مِنْ شِدَّةِ الْفَرَحِ: اللهُمَّ أَنْتَ عَبْدِي وَأَنَا رَبُّكَ! أَخْطَأَ مِنْ شِدَّةِ الْفَرَح».متفق عليه والرواية الأولى لفظ البخاري، والرواية الثانية لفظ مسلم
అబూ మూసా ఇబ్న్ ఖైస్ అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: : “నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం మహిళకు, మహ్రమ్ (భర్త లేదా వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు”.ముస్లిం నమోదు చేసినారు:
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా భుజాన్ని పట్టుకుని (ఒకసారి) నాతో ఇలా అన్నారు: “ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”. ఇబ్న్ ఉమర్ ఇలా అంటూ ఉండేవారు: “సాయంత్రమైతే నీవు ఉదయం కొరకు వేచి చూడకు; మరియు ఉదయం అయితే సాయంత్రం కొరకు వేచి చూడకు. అనారోగ్య సమయంలో పనికి వచ్చేలా ఆరోగ్యం నుండి ఏదైనా గ్రహించు; మరణంలో పనికి వచ్చేలా (ఈ ప్రాపంచిక) జీవితం నుండి.”అల్ బుఖారీ నమోదు చేసినారు: