Hadith for the World

All hadiths

The complete card collection, filter by chapter

655 hadiths

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని ఉల్లేఖించారు: “ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?” దానికి వారు ఇలా అన్నారు: “ఎలాంటి మలినమూ కూడా మిగిలి ఉండదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరి ఐదు సలాహ్’ల (నమాజుల) ఉదాహరణ కూడా ఇటువంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టకాలంలో ఇలా పలికేవారు: "లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్ అజీముల్ హలీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుల్ అర్షిల్ అజీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుస్సమావాతి వ రబ్బుల్ అర్ది, వ రబ్బుల్ అర్షిల్ కరీమ్ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహాన్నతుడు, మహాసహనశీలుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఘనమైన సింహాసనం యొక్క అధిపతి)."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عائشة رضي الله عنها قالت: « خَسَفَتِ الشمس على عهد رسول الله صلى الله عليه وسلم فصَلَّى رسول الله صلى الله عليه وسلم بالناس. فأطال القيام، ثم ركع، فأطال الركوع، ثم قام، فأطال القيام -وهو دون القيام الأول- ثم ركع، فأطال الركوع -وهو دون الركوع الأول- ثم رفع فأطال القيام -وهو دون القيام الأول- ثم سجد، فأطال السجود، ثم فعل في الركعة الأخرى مثل ما فَعَل في الرَّكعة الأولى، ثم انصرف، وقد تَجَلَّتْ الشمس، فخَطَب الناس، فحَمِد الله وأَثْنَى عليه، ثُمَّ قال: إِنَّ الشَّمس والقمَر آيَتَان مِن آيات الله، لا ينْخَسِفَانِ لموت أحد ولا لِحَيَاته، فَإِذا رَأَيتُم ذلك فَادْعُوا اللَّه وكَبِّرُوا ، وصَلُّوا وتَصَدَّقُوا. ثم قال: يا أُمَّة مُحمَّد، واللهِ ما من أحد أغْيَرُ من الله أن يَزْنِيَ عبده أو تَزْنِيَ أَمَتُهُ. يا أُمَّةَ محمد، والله لو تعلمون ما أعلم لَضَحِكْتُمْ قليلا ولَبَكَيْتم كثيرا». وفي لفظ: «فاسْتَكَمَل أَرْبَع رَكَعَاتٍ وَأَرْبَع سَجَدَاتٍ».متفق عليه
عن عائشة رضي الله عنها قالت: «من كلِّ الليل أَوْتَرَ رسول الله صلى الله عليه وسلم : من أول الليل، وأوسطه، وآخره، وانتهى وِتْرُهُ إلى السَّحَرِ».متفق عليه
అమ్ర్ ఇబ్న్ షుఐబ్ రజియల్లాహు అన్హు తన తండ్రి నుండి, ఆయన తన తండ్రి (అమ్ర్ ఇబ్న్ షుఐబ్ తాత) నుండి ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”అబూదావూద్ నమోదు చేసినారు:
عن عبد الله بن زيد بن عَاصِم المازِنِي رضي الله عنه قال: «خرج النبي صلى الله عليه وسلم يَسْتَسْقِي، فتَوَجَّه إلى القبلة يدْعو، وحَوَّل رِدَاءه، ثم صلَّى ركعتين، جَهَرَ فيهما بالقِراءة». وفي لفظ «إلى الْمُصَلَّى».متفق عليه
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీలో ఎవరైనా ఆవులింత వస్తే, (వెంటనే) తన నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి, ఎందుకంటే నిశ్చయంగా షైతాన్ లోపలికి ప్రవేశిస్తాడు.ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు “అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. ఆయన “(‘గీబత్’ అంటే) మీ సోదరుని గురించి అతడు ఇష్టపడని విధంగా మాట్లాడడం” అన్నారు. వారిలో ఒకరు “నా సోదరుని గురించి నేను చెబుతున్నది నిజమే అయితే? దాని గురించి మీరు ఏమంటారు?” అని అడిగారు. దానికి ఆయన “నీ సోదరుని గురించి నీవు చెబుతున్నది ఒకవేళ నిజమే అయితే, నీవు అతడి గురించి “గీబత్’ చేసావు, ఒకవేళ నిజం కాకపోతే నీవు అతడిపై అపనింద వేసావు” అన్నారు”ముస్లిం నమోదు చేసినారు:
عن ابن عمر رضي الله عنهما مرفوعا: «الظلم ظلمات يوم القيامة». عن جابر رضي الله عنهما مرفوعا: «اتقوا الظلم، فإن الظلم ظلمات يوم القيامة، واتقوا الشُّحَ؛ فإنه أَهْلَكَ من كان قبلكم».حديث ابن عمر -رضي الله عنهما-: متفق عليه. حديث جابر -رضي الله عنه-: رواه مسلم
ఖౌలహ్ అల్ అన్సారియహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “కొందరు అల్లాహ్ యొక్క సంపత్తిని న్యాయ విరుద్ధంగా (మూర్ఖంగా, లక్ష్యరహితంగా) వినియోగిస్తారు. తీర్పు దినమునాడు అటువంటి వారికి నరకాగ్నియే గతి”.అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అనుమానాలకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అనుమానం (మనం మాట్లాడే) మాటల్లోనే అత్యంత అసత్యమైనది, దుర్మార్గమైనది. మరియు మీరు ఒకరిని గురించి ఒకరు ఆరాలు తీయకండి; ఒకరిపైనొకరు గూఢచర్యం చేయకండి; ఒకరిపైనొకరు అసూయ చెందకండి; ఒకరినొకరు వదిలివేయకండి (సంబంధాలు తెంచుకోకండి); మరియు మీరు ఒకరినొకరు అసహ్యించుకోకండి. మరియు ఓ అల్లాహ్ దాసులారా సోదరులుగా ఉండండి.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త్ర సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن مسعود رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : "إذا كنتم ثلاثة فلا يتناجى اثنان دون الآخَر، حتى تختلطوا بالناس؛ من أجل أن ذلك يحُزنه".متفق عليه
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీ కంటే క్రింద ఉన్నవారిని చూడండి; మీ కంటే పైన ఉన్నవారిని చూడకండి. అలా చేయడం వల్ల అల్లాహ్ మీకు ప్రసాదించి అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు - దాన్ని దార్మి ఉల్లేఖించారు
అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు – “సత్కార్యాలలో దేనినీ అల్పమైనదిగా భావించకండి; అది మీ సహోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో, ఉల్లాసంగా కలవడమైనా సరే”.ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: "బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: "لِيُسَلِّمِ الصغيرُ على الكبيرِ، والمارُّ على القاعدِ، والقليلُ على الكثيرِ" وفي رواية: "والراكبُ على الماشي".متفق عليه
అబీ మస్'ఊద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది" అన్నారు.ముస్లిం నమోదు చేసినారు:
عن علي بن أبي طالب رضي الله عنه مرفوعاً: «إذا انْتَعَل أحدكم فليبدأ باليمين، وإذا نَزَعَ فليبدأ بالشمال، ولْتَكُن اليُمنى أولَهُما تُنْعَل، وآخِرَهُما تُنْزَع».متفق عليه
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما مرفوعاً: "كُلُوا، وَاشْرَبُوا، وَتَصَدَّقُوا، وَالْبَسُوا، غَيْرَ مَخِيلَة، وَلَا سَرَف".رواه ابن ماجه والإمام أحمد، وذكره البخاري في صحيحه تعليقًا مجزومًا به
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు".అల్ బుఖారీ నమోదు చేసినారు: