Hadith for the World

All hadiths

The complete card collection, filter by chapter

655 hadiths

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా ఆయన విన్నారు: “మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు. అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలు దేరుతాయి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయి.”అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘నేను మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ చెప్తుండగా విన్నాను ‘నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.ముత్తఫిఖ్ అలైహి
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «وَاللهِ إني لأَسْتَغْفِرُ اللهَ وأَتُوبُ إليهِ في اليومِ أَكْثَرَ من سَبْعِينَ مَرَّةً».رواه البخاري
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఒకరైన అల్ అగర్రి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ ప్రజలారా! అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడండి, ఎందుకంటే నేను రోజుకు వంద సార్లు ఆయన వద్ద పశ్చాత్తాపపడతాను."ముస్లిం నమోదు చేసినారు:
అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “అల్లాహ్ ప్రకటన: “ఓ నా దాసులారా! నేను ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) నాపై నేను నిషేధించుకున్నాను మరియు ‘జుల్మ్’ను మీ మధ్యన కూడా నిషేధించాను. కనుక మీరు ఒకరిపైనొకరు ‘జుల్మ్’నకు పాల్బడకండి, ఓ నా దాసులారా! ఎవరికైతే నేను మార్గదర్శకత్వం చేసినానో, వారు తప్ప మిగిలిన వారందరూ మార్గభ్రష్ఠులైన వారే. కనుక నా నుంచి మార్గదర్శకత్వం కోరుకొండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను తినిపించినానో, వారు తప్ప మిగిలిన వారందరూ ఆకలితో అలమటించే వారే. కనుక నా నుండి పోషణ కోరుకొండి, నేను మీకు పోషణనిస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను వస్త్రాలను తొడిగించానో, వారు తప్ప మిగిలిన వారందరూ వివస్త్రులే, కనుక నా నుండి వస్త్రాలను కోరండి, నేను మీకు వస్త్రాలనిస్తాను. ఓ నా దాసులారా! నిశ్చయంగా మీరు రాత్రుల యందు, పగటియందు పాపకార్యాలకు పాల్బడతారు మరియు నేను మీ పాపాలనన్నింటినీ క్షమిస్తాను. కనుక పాపక్షమాపణ కొరకు నన్ను అర్థించండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. ఓ నా దాసులారా! ఒకవేళ మీరు నాకు ఏదైనా హాని కలిగించ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ హాని కలిగించలేరు. అలాగే ఒకవేళ మీరు నాకు ఏదైనా మంచిని కలుగజేయ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ మంచిని కలుగజేయలేరు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత దైవభీతి గల హృదయం మాదిరి – అత్యంత దైవ భీతి గలవారిగా, అత్యంత పవిత్రులుగా మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ జోడించదు, ఏమీ ఉన్నతం చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత హీనమైన, నీచమైన, పాపిష్ఠి హృదయం మాదిరి – అత్యంత పాపిష్ఠులుగా, నీచులుగా, మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ నష్టము, హాని కలిగించదు, ఏమీ తక్కువ చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులు – ఒకవేళ అందరూ కలిసి ఒక మైదానంలో నిలబడి, నన్ను అర్థిస్తే, నేను అందరికీ వారు కోరుకున్నదంతా ప్రసాదించినా, అది నా ఖజానా నుంచి, సముద్రంలో ముంచిన సూది మొన సముద్రం నుండి ఎంత నీటిని తగ్గిస్తుందో, అంత కూడా తగ్గించదు. ఓ నా దాసులారా! నిశ్చయంగా, అవి మీ కర్మలు మాత్రమే, వాటి కొరకు మీరు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు. అపుడు నేను మీకు దాని పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాను. కనుక ఎవరైనా మంచిని, శుభాన్ని సాధించినట్లయితే అందుకు అల్లాహ్ ను ప్రస్తుతించాలి మరియు ఎవరైనా చెడుకు పాల్బడితే అందుకు మరెవ్వరినో కాకుండా తనను తాను నిందించుకోవాలి.ముస్లిం నమోదు చేసినారు:
"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "ఒకరోజు సవారీపై నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉన్నాను. అపుడు వారు నాతో ఇలా పలికారు "ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో. గుర్తుంచుకో, ఒకవేళ ఈ ఉమ్మత్ (ముస్లిం జాతి మొత్తం), నీకు ఏమైనా ప్రయోజనం కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమీ ప్రయోజనం కలుగజేయలేరు, అల్లాహ్ నీకోరకు ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. అలాగే, ఒకవేళ ఈ ఉమ్మత్ (సమాజం మొత్తం), నీకు ఏమైనా హాని (నష్టము) కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమాత్రమూ హాని (నష్టము) కలుగజేయలేరు, అల్లాహ్ నీకు వ్యతిరేకంగా ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. కలములన్నీ లేపి వేయబడినాయి, కాగితములన్నీ ఇంకిపోయాయి (ఎండిపోయినాయి). (అంటే, అల్లాహ్ ముందుగానే ప్రతి విషయాన్ని పూర్వ నిర్దేశము గావించి ఉంచినాడని, ఇక దానికి జోడించడానికి లేదా అందునుండి ఏమైనా తీసివేయడానికి ఏమాత్రమూ వీలు లేదు అని అర్థము).అత్తిర్మిదీ నమోదు చేసినారు:
عن أبي ذر رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم :«عُرِضَتْ عَلَيَّ أعمالُ أُمتي، حَسَنُهَا وسَيِّئُهَا فَوَجَدتُ في مَحَاسِنِ أَعْمَالِهَا الأَذَى يُمَاطُ عَنِ الطَّرِيقِ، ووَجَدتُ في مَسَاوِئِ أَعْمَالِهَا النُّخَاعَةُ تَكُونُ في المَسْجِدِ لا تُدْفَنُ».رواه مسلم
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సర్వ శక్తిమంతుడు, మహోన్నతుడు అయిన తన ప్రభువు ఇలా ప్రవచించినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు: “నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు.” అపుడు పరమ పవితృడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. తరువాత అతడు మళ్ళీ పాపపు పని చేసాడు. అతడు మళ్ళీ ఇలా వేడుకున్నాడు “ఓ నా ప్రభూ! నా ఈ పాపాన్ని క్షమించు”. అపుడు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని, మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. నేను నా దాసుణ్ణి క్షమించాను. అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي أمامة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم كَانَ إذا رَفَعَ مَائِدَتَهُ، قال: «الحَمْدُ للهِ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ، غَيْرَ مَكْفِيٍّ، وَلَا مُوَدَّعٍ، وَلَا مُسْتَغْنًى عَنْهُ رَبَّنَا».رواه البخاري
عن عائشة رضي الله عنها قالت: كان رسولُ اللهِ صلى الله عليه وسلم إذا فَاتَتْهُ الصَّلَاةُ مِنَ الليلِ مِن وَجَعٍ أَوْ غَيْرِهِ، صَلَّى من النَّهَارِ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً.رواه مسلم
عن عائشة رضي الله عنها والمغيرة بن شعبة رضي الله عنه : أن النبي صلى الله عليه وسلم كان يقوم من الليل حتى تَتَفَطَّرَ قَدَمَاهُ فقلت له: لم تَصْنَعُ هذا يا رسول الله، وقد غفر اللهُ لك ما تقدم من ذنبك وما تأخر؟ قال: «أَفَلَا أحب أن أكونَ عبدا شَكُورًا».حديث عائشة -رضي الله عنها-: متفق عليه. حديث المغيرة بن شعبة -رضي الله عنه-: متفق عليه
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: «لا يُلْدَغُ المؤمنُ من جُحْرٍ واحد مرتين».متفق عليه
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, మరియు అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన ప్రదేశాలు మార్కెట్లు (బజార్లు, సంతలు, అంగళ్ళు, వాణిజ్యకేంద్రాలు, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశలు మొ.)”.ముస్లిం నమోదు చేసినారు:
జరీర్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”ముస్లిం నమోదు చేసినారు:
عن أنس رضي الله عنه قَالَ: كُنْتُ أمشي مَعَ رسول الله صلى الله عليه وسلم وَعَلَيْهِ بُرْد نَجْرَانيٌّ غَلِيظُ الحَاشِيَةِ، فأدْرَكَهُ أعْرَابِي فَجَبذَهُ بِرِدَائِهِ جَبْذَة شَديدة، فَنَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبيِّ صلى الله عليه وسلم وَقَدْ أثَّرَتْ بِهَا حَاشِيَة الرِّدَاءِ مِنْ شِدَّةِ جَبْذَتِه، ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ، مُر لِي مِنْ مَالِ اللهِ الَّذِي عِنْدَكَ. فَالتَفَتَ إِلَيْهِ، فَضَحِكَ ثُمَّ أَمَرَ لَهُ بِعَطَاءٍ.متفق عليه
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప”. (అది విని) వారితో ఇలా అనడం జరిగింది “ఓ రసూలుల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు?” దానికి వారు “ఎవరైతే నాకు విధేయత చూపుతారో (నన్ను అనుసరిస్తాడో) అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతాడో (నన్ను అనుసరించడో) నిశ్చయంగా అతడు నిరాకరించిన వాడు”.అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.అత్తిర్మిదీ నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «لما خلق اللهُ الخَلْقَ كتب في كتاب، فهو عنده فوق العرش: إن رحمتي تَغْلِبُ غضبي». وفي رواية: «غَلَبَتْ غضبي» وفي رواية: «سَبَقَتْ غضبي».متفق عليه
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు. ఆదము సంతానం యొక్క కడుపును ధూళి (మట్టి) తప్ప మరేమీ నింపదు, మరియు అల్లాహ్ పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه قال: ما عاب رسول الله صلى الله عليه وسلم طعاما قط، إن اشتهاه أكله، وإن كرهه تركه.متفق عليه
عن أبي سعيد الخدري رضي الله عنه مرفوعاً: أنَّ ناسًا من الأنصارِ سألوا رسولَ الله - صلى الله عليه وسلم - فأعطاهم، ثم سألوه فأعطاهم، حتى نَفِدَ ما عنده، فقال لهم حين أنفقَ كلَّ شيءٍ بيده: «ما يَكُنْ عندي من خيرٍ فلن أَدَّخِرَهُ عَنْكُم، ومَنْ يَسْتَعْفِفْ يُعِفِّهُ اللهُ، ومَنْ يَسْتَغْنِ يُغْنِهِ اللهُ، ومَنْ يَتَصَبَّرْ يُصَبِّرْهُ اللهُ. وما أُعْطِيَ أَحَدٌ عطاءً خَيرًا وأَوسع من الصبرِ».متفق عليه