Hadith for the World

All hadiths

The complete card collection, filter by chapter

655 hadiths

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «للَّهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضِ فَلاَةٍ». وفي رواية: «لَلَّهُ أَشَدُّ فَرَحًا بِتَوْبَةِ عَبْدِهِ حِينَ يَتُوبُ إِلَيْهِ، مِنْ أَحَدِكُمْ كَانَ عَلَى رَاحِلَتِهِ بِأَرْضِ فَلَاةٍ، فَانْفَلَتَتْ مِنْهُ وَعَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ، فَأَيِسَ مِنْهَا، فَأَتَى شَجَرَةً، فَاضْطَجَعَ فِي ظِلِّهَا، وقَدْ أَيِسَ مِنْ رَاحِلَتِهِ، فَبَيْنَا هُوَ كَذَلِكَ إِذَا هُوَ بِهَا، قَائِمَةً عِنْدَهُ، فَأَخَذَ بِخِطَامِهَا، ثُمَّ قَالَ مِنْ شِدَّةِ الْفَرَحِ: اللهُمَّ أَنْتَ عَبْدِي وَأَنَا رَبُّكَ! أَخْطَأَ مِنْ شِدَّةِ الْفَرَح».متفق عليه والرواية الأولى لفظ البخاري، والرواية الثانية لفظ مسلم
అబూ మూసా ఇబ్న్ ఖైస్ అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: : “నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైతే ‘అల్లాహ్ మార్గములో’ ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై సంవత్సరాల (దూరం) వరకు దూరం చేస్తాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
సహ్ల్ బిన్ సఅ్’ద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఉపవాస విరమణలో త్వరపడినంత కాలం ప్రజలు శుభాన్ని కలిగి ఉంటారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జైద్ ఇబ్నె థాబిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ (ఉపవాసం ప్రారంభించే ముందు చేసే) భోజనం చేసినాము. తర్వాత ఆయన నమాజ్‌ కొరకు లేచినారు. అపుడు నేను ఇలా అడిగాను: అదాన్ (నమాజు కొరకు పిలిచే పిలుపు) మరియు సహరీ మధ్య ఎంత సమయం ఉండింది? దానికి ఆయన ఇలా అన్నారు: సుమారు 50 ఆయతుల అంత (అంటే 50 ఖుర్‌ఆన్ వచనాలు పఠించే సమయమంత అని అర్థము).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా చాలామంది ఒకచోట కూడి ఒక వ్యక్తికి నీడను కల్పిస్తున్నారు,అది చూచి ప్రవక్త అది ఏమిటి ?అని అడిగారు అక్కడ ఉన్నవారు ‘అతడు ఉపవాసి’ అని చెప్పారు, ప్రవక్త సమాధానమిస్తూ; ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు అని చెప్పారు, ముస్లిం హదీథు నమోదు ప్రకారం ‘అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని ఉంది.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో బానిసపై మరియు స్వతంత్ర వ్యక్తిపై, పురుషులపై మరియు స్త్రీలపై, చిన్నవారిపై మరియు పెద్దవారిపై మొత్తం అందరిపై ఒక సాఅ ఖర్జూరాలు లేదా ఒక సాఅ బార్లీ జకాతుల్-ఫితర్‌ దానం చెల్లింపును విధిగావించారు. ప్రజలు ఈద్ నమాజుకు వెళ్ళే ముందే దానిని చెల్లించాలని ఆయన ఆదేశించారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం మహిళకు, మహ్రమ్ (భర్త లేదా వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عائشة وأم سلمة رضي الله عنهما «أن رسول الله صلى الله عليه وسلم كان يُدْرِكُهُ الفجر وهو جُنٌبٌ من أهله، ثم يغتسل ويصوم ».متفق عليه
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతను తన ఉపవాసాన్ని పూర్తిగా కొనసాగించాలి. ఎందుకంటే అతనికి ఆహారం, పానీయం ఇచ్చింది స్వయంగా అల్లాహ్ యే."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عمر بن الخطاب رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إذا أقبل الليل من هَهُنا، وأَدْبَرَالنهار من ههنا، فقد أفطر الصائم».متفق عليه
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు”.ముస్లిం నమోదు చేసినారు:
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ అల్ హవ్’రా అస్-స’దీ ఇలా పలికినారు: “హసన్ ఇబ్న్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ను నేను ఇలా అడిగాను: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నీవు ఏమి కంఠస్థము చేసినావు?” దానికి ఆయన ఇలా బదులు పలికినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను దీనిని కంఠస్థము చేసినాను - “సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది ఎందుకంటే అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా ఉదూ చేస్తాడు, తరువాత అతడు మస్జిద్ కు బయలుదేరుతాడు; అతడిని సలాహ్ తప్ప మరింకే విషయమూ అలా చేయడానికి ప్రోత్సహించదు; సలాహ్ ఆచరించడం తప్ప అతడు మరింకేదీ కోరుకోడు; (అటువంటి స్థితిలో) అతడు మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; అతడి నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది; మరి మస్జిదులోనికి ప్రవేశించిన తరువాత కేవలం సలాహ్ మాత్రమే అతడు మస్జిదులో వేచి ఉండేలా చేసినట్లయితే, అతడు వేచి ఉన్న సమయమంతా అతడు సలాహ్ లోనే ఉన్నట్లుగా భావించబడుతుంది; అటువంటి వాని కొరకు, అతడు సలాహ్ ఆచరించిన స్థానములోనే కూర్చుని ఉన్నంత వరకు, దైవదూతలు అల్లాహ్’ను ప్రార్థిస్తూ ఉంటారు – నీవు అక్కడ ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంత వరకు, లేదా నీ ఉదూ భంగం కానంత వరకు దైవదూతలు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు “ఓ అల్లాహ్ అతడిని కరుణించు, ఓ అల్లాహ్ అతడిని క్షమించు, ఓ అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా భుజాన్ని పట్టుకుని (ఒకసారి) నాతో ఇలా అన్నారు: “ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”. ఇబ్న్ ఉమర్ ఇలా అంటూ ఉండేవారు: “సాయంత్రమైతే నీవు ఉదయం కొరకు వేచి చూడకు; మరియు ఉదయం అయితే సాయంత్రం కొరకు వేచి చూడకు. అనారోగ్య సమయంలో పనికి వచ్చేలా ఆరోగ్యం నుండి ఏదైనా గ్రహించు; మరణంలో పనికి వచ్చేలా (ఈ ప్రాపంచిక) జీవితం నుండి.”అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒకరిపై మరొకరు ఈర్ష్య పడకండి, ఒకరి కోసం మరొకరు కావాలని ధరలను కృత్రిమంగా పెంచకండి, ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరికొకరు దూరం కాకండి, వ్యాపారంలో ఒకరి లావాదేవీలను మరొకరు భంగపరచకండి. బదులుగా, అల్లాహ్ యొక్క దాసులుగా సోదర భావంతో ఉండండి. ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు: అతనికి అన్యాయం చేయడు, అతనికి అవసరమైనప్పుడు సహాయం చేయకుండా నిరాకరించడు, అతడిని మోసగించడు, అతడిని అవమానించడు. "నిజమైన తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తి) ఇక్కడ ఉంది" అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ఛాతీ వైపు మూడుసార్లు సూచించారు. ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని ధిక్కరించడం, అవమానించడం చాలా చెడ్డ పని. ఒక ముస్లింపై మరొక ముస్లిం కొరకు నిషేధించబడిన విషయాలు - అతని ప్రాణం, ఆస్తి మరియు గౌరవం."ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “నాకు ఏమైనా బోధించండి” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని పలికారు. అతడు పలుమార్లు అదే ప్రశ్నను అడిగాడు. ప్రతీ సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని సమాధానమిచ్చారు.అల్ బుఖారీ నమోదు చేసినారు: