Hadith for the World

All hadiths

The complete card collection, filter by chapter

655 hadiths

ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు: "ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది. ప్రతి ముస్లిం తల వద్ద అతని కొరకు నియమించబడిన ఒక దైవదూత ఉంటాడు. ఆ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి మంచి కొరకు దుఆ చేసినప్పుడల్లా, అతని కొరకు నియమించబడిన దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, ఇదే మంచిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించు గాక."ముస్లిం నమోదు చేసినారు:
ఉమ్మె అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై నిషేధించలేదు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن جابر بن عبد الله رضي الله عنهما مرفوعاً: «لا تدعوا على أنفسكم؛ ولا تدعوا على أولادكم، ولا تدعوا على أموالكم، لا توافقوا من الله ساعة يُسأل فيها عطاءٌ فيستجيب لكم».رواه مسلم
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: يُستجاب لأحدكم ما لم يَعْجَلْ: يقول: قد دعوت ربي، فلم يستجب لي». وفي رواية لمسلم: «لا يزال يُستجاب للعبد ما لم يَدْعُ بإثم، أو قطيعة رحم، ما لم يَسْتَعْجِلْ» قيل: يا رسول الله ما الاستعجال؟ قال: «يقول: قد دعوت، وقد دعوت، فلم أر يستجب لي، فَيَسْتَحْسِرُ عند ذلك ويَدَعُ الدعاء».متفق عليه
అబూ ఉమామహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు ఈ విషయాన్ని అమ్ర్ ఇబ్న్ అబసహ్ రదియల్లాహు అన్హు తెలియజేసారు; ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నారు: “ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము. ఆ ఘడియలో (రాత్రి చివరి భాగములో) అల్లాహ్ ను స్మరించే వారిలో ఒకరు కాగలిగే సామర్థ్యము మీలో ఉంటే అలా చేయండి.”అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్. అబూ ఖిలాబహ్ (హదీసు ఉల్లేఖకులలో ఒకరు) ఇలా అన్నారు: “ఆయన కుటుంబము (పై ఖర్చు చేయుట) తో మొదలు పెట్టినారు”, తరువాత అబూ ఖిలాబహ్ ఇంకా ఇలా అన్నారు: “తన కుటుంబములోని చిన్న పిల్లల కోసం ఖర్చు చేసే వ్యక్తి కంటే గొప్ప ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? తద్వారా అతడు వారిని కాపాడుతాడు (కోరికల నుండి కాపాడతాడు) మరియు దాని వల్ల అల్లాహ్ వారికి లాభం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.”ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «الإيمانُ بِضْعٌ وَسَبْعُونَ أو بِضْعٌ وسِتُّونَ شُعْبَةً: فَأَفْضَلُهَا قَوْلُ: لا إله إلا الله، وَأَدْنَاهَا إِمَاطَةُ الأَذَى عَنِ الطَّرِيقِ، وَالحَيَاءُ شُعْبَةٌ مِنَ الإِيمَانِ».متفق عليه
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."ముస్లిం నమోదు చేసినారు:
عن معاذ بن أنس رضي الله عنه مرفوعًا: «مَن كَظَمَ غَيظًا، وَهُو قادر على أن يُنفِذَه، دَعَاه الله سبحانه وتعالى على رؤوس الخَلاَئِق يوم القيامة حتَّى يُخَيِّره من الحُور العَين مَا شَاء».رواه أبو داود والترمذي وابن ماجه وأحمد
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు అన్ని సందర్భాలలో ఇస్తిఖారా నమాజ్‌ చేయుటను ఖుర్ఆన్‌లోని సూరాలు నేర్పినట్టుగా నేర్పించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు: "మీలో ఎవరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే, తప్పనిసరి ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల (ఇస్తిఖారహ్) నమాజ్ చేయాలి. తర్వాత ఇలా దువా చేయాలి: اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي، وَمَعَاشِي، وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ، ثُمَّ أَرْضِنِي» قَالَ: «وَيُسَمِّي حَاجَتَه». ("అల్లాహుమ్మ ఇన్నీ అస్'తఖీరుక బి ఇల్మిక, వ అస్తఖ్'దిరుక బి ఖుద్'రతిక, వ అస్అలుక మిల్ ఫద్'లికల్ అజీమ్, ఫఇన్నక తఖ్'దిరు వలా అఖ్'దిరు, వ తఅ్'లము వలా అఅ్'లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదాల్ అమ్'ర - (ఇక్కడ మీ విషయం ప్రస్తావించాలి) - ఖైరున్ లి ఫిద్దునియా వమఆషీ వ ఆఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు - ఆజిలిహి వ ఆజిలిహి - ఫఖ్'దుర్'హు లీ వ యస్సిర్'హు లీ థుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదల్ అమ్'ర షర్రు లీ ఫిద్దునియా వ మఆ్'షీ వ ఆ్'ఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు ఆజిలిహి వ ఆజిలిహి - ఫస్'రిఫ్'హు అ'న్నీ వస్'రిఫ్'నీ అ'న్'హు వఖ్'దుర్ లిల్ ఖైర హంథు కాన థుమ్మ అర్'దినీ బిహి) అర్థం: "అల్లాహ్, నేను నీ జ్ఞానంతో నీ సలహా అడుగుతున్నాను. నీ శక్తితో నేను నీ వద్ద బలాన్ని కోరుతున్నాను. నీ గొప్ప దయను నేను అడుగుతున్నాను. ఏదైనా నువ్వే చేయగలవు, నేనేమీ చేయలేను. నీకే సర్వం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వే గోచర, అగోచరాలన్నింటి జ్ఞానం గలవాడివి. ఓ అల్లాహ్! ఈ విషయం (తన అవసరాన్ని ఇక్కడ చెప్పాలి) నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) మంచిదని నీ జ్ఞానంలో ఉంటే, అది నా కొరకు నిర్ణయించు, సులభతరం చేయు, దానిలో నాకు శుభాలు ప్రసాదించు. ఇది నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) చెడుగా ఉంటే, దానిని నన్ను దూరం చేయు, నన్ను దాని నుండి దూరం చేయు, అది ఎక్కడ ఉన్నా నా కొరకు మంచి దానినే నిర్ణయించు, నన్ను దానితో సంతృప్తిగా ఉంచు." ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: "తన అవసరాన్ని (ఏ విషయం కోసం ఇస్తిఖారా చేస్తున్నాడో) స్పష్టంగా పేరు పెట్టి చెప్పాలి."అల్ బుఖారీ నమోదు చేసినారు:
عن أنس بن مالك رضي الله عنه قال: مرَّ النَّبي - صلى الله عليه وسلم - بامرَأَة تَبكِي عِند قَبرٍ، فقال: «اتَّقِي الله واصْبِري» فقالت: إليك عَنِّي؛ فَإِنَّك لم تُصَب بِمُصِيبَتِي ولم تَعرِفه، فقِيل لها: إِنَّه النَّبِي - صلى الله عليه وسلم - فأتت باب النبي - صلى الله عليه وسلم - فلم تجد عنده بوَّابِين، فقالت: لم أَعرِفكَ، فقال: «إِنَّما الصَّبرُ عِند الصَّدمَةِ الأُولَى». وفي رواية: «تَبكِي على صبِّي لها».متفق عليه
షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”ముస్లిం నమోదు చేసినారు:
عن عائشة رضي الله عنها قالت: كَانَ كَلاَمُ رَسُولِ الله -صلَّى الله عليه وسلَّم- كَلاَمًا فَصلاً يَفْهَمُهُ كُلُّ مَنْ يَسْمَعُهُ.رواه أبو داود واللفظ له، والتُرمذي والنسائي وأحمد
عن أبي سعيد الخدري رضي الله عنه مرفوعاً: «إِنَّ مِنْ أَشَرِّ النَّاسِ عِندَ الله مَنزِلَةً يَومَ القِيَامَةِ الرَّجُلَ يُفضِي إِلَى المَرْأَةِ وَتُفْضِي إِلَيه، ثُمَّ يَنشُرُ سِرَّهَا».رواه مسلم
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"ఆహ్మద్ నమోదు చేసినారు:
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ద్వారా ఉల్లేఖిస్తూ చెబుతున్నారు : నిశ్చయంగా దైవప్రవక్త తెలియజేశారు"నిశ్చయంగా ఎంత పెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం ఉంటుంది,నిస్సందేహంగా అల్లాహ్ తఆలా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతనిపట్ల సంతోష పడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతనిపట్ల క్రోధాన్ని చూపుతాడుదాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.ముస్లిం నమోదు చేసినారు:
عن علي بن أبي طالب رضي الله عنه قال: "حدثوا الناس بما يعرفون، أتريدون أن يُكذَّب اللهُ ورسولهُ؟".أخرجه البخاري
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”.అబూదావూద్ నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”ముస్లిం నమోదు చేసినారు: